Guntur Ladies Murders : ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇద్దరు మహిళలు హత్యకు గురయ్యారు. రెండు వేర్వేరు ఘటలు. ఓ మహిళ ను అంతమొందించించి కట్టుకున్న భర్తే అయితే మరో మహిళను ఎవరు చంపారో పోలీసులకూ అర్థం కావడం లేదు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మహిళలపై దాడులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.గుంటూరు పట్టణంలో ఓ ప్రేమోన్మాది యువతిపై హత్యాయత్నం చేసిన ఘటన జరిగి ఇరవై నాలుగు గంటలు గడవక ముందే ఈ రెండు హత్యలు జరిగాయి.
నడికుడిలో కట్టుకున్న భార్యను చంపేసిన భర్త !
పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం నడికుడిలో నాగమణి అనే యువతిని అత్యంత దారుణంగాహత్య చేశాడు భర్త రమేష్. వేట కత్తితో ఇంట్లోనే విచక్షణా రహితంగా దాడి చేశాడు. దాంతో ఇల్లు అంతా రక్తంతో తడిచిపోయింది. కట్టుకున్న భార్యను ఇంత దారుణంగా ఎందుకు చంపాల్సి వచ్చిందో కానీ.. రమేష్ మాత్రం... వివాహేతర బంధాలను పెట్టుకుందని ఎన్ని సార్లు చెప్పినా మారడం లేదని అందుకే చంపేశానని పోలీసులకు చెబుతున్నాయి. రమేష్‌కు నాగమణితో ఇటీవలే వివాహం అయింది. బతుకుదెరువు కోసం ఇద్దరూ నడికుడిలోనే నివాసం ఉంటున్నారు. ఇద్దరూ పెద్దగా గొడవ పడినట్లుగా ఉండరు. కానీ హఠాత్తుగా తెల్లవారు జామున పెద్ద ఎత్తున అరుపులు వినిపించడంతో ప్రజలు ఉలిక్కి పడ్డారు. వచ్చి చూసేసరి వేటకత్తితో రమేష్ కనిపించారు. దీంతో జనం పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి చూసే సరికి నాగమణి రక్తపుమడుగులో ఉంది.
గుంటూరులో మహిళ కాళ్లు, చేతులు కట్టేసి హత్య !
గుంటూరు టౌన్ లోని చంద్రముఖీ ఫ్యాషన్స్ లో పనిచేస్తున్న పద్మావతి అనే మహిళను కూడా దుండగులు కాళ్ళు, చేతులు కట్టివేసి గుడ్డలు కుక్కి హతమార్చారు. షాప్ సమీపంలోనే ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న పద్మావతి.. ఉదయం బయటకు రాకపోయే సరికి స్థానికులు ఇంట్లో చూశారు. కాళ్ళు, చేతులు కట్టేసి నోటిలో గుడ్డలు కుక్కడంతో ఊపిరాడక చనిపోయినట్లుగా గుర్తించారు. హత్యా చేసిన విధానం చూసి దోపిడి దొంగలపనే అని పోలీసులు అంటున్నారు. అయితే ఇంటికి ఇంటికి మధ్య పెద్ద గ్యాప్ ఉండని కాలనీలో.. దోపిడీ దొంగలు.. అదీ కూడా పెద్దగా ఆస్తిపాస్తులు ఉండదని.. బట్టల దుకాణంలో పని చేసుకునే మహిళ ఇంట్లో ఎందుకు దోపిడికి ప్రయత్నిస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన యస్సీ ఆరీఫ్ హఫీజ్ అన్ని కోణాల్లోనూ కేసును విచారించాలని ఆదేశించారు.
నేరాలకు అడ్డు కట్ట ఎప్పుడు !
ఇటీవలి కాలంలో గుంటూరులో మహిళలపై దాడులు.. ఇతర నేరాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దాదాపుగా ప్రతీ రోజూ సంచలనాత్మక కేసులు వెలుగులోకి వస్తున్నాయి. నేరస్తులకుభయం లేకుండా పోవడం వల్ల ఇలా నేరాలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.