Selling liquor in Srisailam | నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో భారీగా మద్యం పట్టుకున్నారు పోలీసులు. శ్రీశైలం  పోలీసులు కేసులు నమోదు చేసినా మద్యం విక్రదారులు ఏం లెక్క చేయడం లేదు. ఆధ్యాత్మిక క్షేత్రంలో మద్యం అమ్ముతూ తనిఖీల్లో దొరుకుతున్నా వారితీరు మారడం లేదు.

శ్రీశైలం ఆర్టీసీ బస్ పార్కింగ్ ఏరియాలో ఇద్దరు వ్యక్తులు మద్యం అమ్ముతూ పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి 98 మద్యం బాటిల్ స్వాధీనం చేసుకున్నారు శ్రీశైలం పోలీసులు. శ్రీశైలం సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ రావు, సిబ్బంది తనిఖీలలో భాగంగా ఆర్టీసీ బస్సు పార్కింగ్ ఏరియాలో   మద్యం అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

మద్యం విక్రయిస్తున్న మొతిరాం, బుజ్జిలపై శ్రీశైలం పోలీసులు కేసు నమోదు చేశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ నిబంధనలను అనుసరించి క్షేత్రంలో ఎటువంటి మత్తు పదార్థాలు, మత్తు పానీయాలను తీసుకురాకూడదు. శ్రీశైలంలో ఇలాంటివి విక్రయించడంపై ఉక్కు పాదం మోపుతామని, క్షేత్రం పవిత్రతకు భంగం వాటిలితే చట్టరీత్యా చర్యలు తప్పవని శ్రీశైలం సిఐ ప్రసాదరావు హెచ్చరించారు.