TTD Defamation Case : తిరుపతి కోర్టులో మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామికి చుక్కెదురైంది. ఓ పత్రికకు వ్యతిరేకంగా టీటీడీ వేసిన రూ.100 కోట్ల పరువు నష్ట దావా కేసులో వాదనలు వినిపించేందుకు సుబ్రమణ్యస్వామి ఇవాళ తిరుపతి కోర్టు హాజరు అయ్యారు. టీటీడీ తరపున న్యాయస్థానంలో వాదించేందుకు సుబ్రహ్మణ్యస్వామి ప్రయత్నించగా, అందుకు అపోజిషన్ న్యాయవాది క్రాంతి కుమార్ అభ్యంతరం తెలియజేశారు. సుబ్రమణ్యస్వామికి లాయర్ పట్టా లేనందున వాదనకు అనుమతి ఇవ్వరాదని న్యాయవాది క్రాంతి కుమార్ న్యాయమూర్తిని కోరారు. దీనిని పరిశీలించిన న్యాయమూర్తి జులై 11కు విచారణ వాయిదా వేశారు. అయితే సుబ్రహ్మణ్యస్వామి టీటీడీకి సపోర్టు చేస్తూ ఇద్దరూ అసిస్టెంట్ న్యాయవాదుల చేత కోర్టులో వాదనలు వినిపించనున్నారు.
టీటీడీ పరువు నష్టం కేసు
తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా 2019, డిసెంబర్ 1న ఓ పత్రిక ఓ కథనం ప్రచురించిందని టీటీడీ పరువు నష్టం కేసు వేసింది. తిరుపతి నాల్గో అదనపు జిల్లా కోర్టులో ఈ కేసుకు సంబంధించి విచారణ జరుగుతోంది. పత్రిక యాజమాన్యం, ఇతరులు కలిసి టీటీడీ పరువుకు భంగం కలిగించేలా కథనాలు ప్రచురించారని, ఈ నేపథ్యంలో రూ.100 కోట్లు పరువు నష్టం చెల్లించేలా ఆ పత్రిక యాజమాన్యాన్ని ఆదేశించాలని తిరుపతి పదో అదనపు జిల్లా జడ్జి కోర్టులో టీటీడీ గత ఏడాది పరువు నష్టం కేసును దాఖలు చేసింది.
ఆ అనుమతి రద్దు చేయాలని వాదనలు
టీటీడీ తరఫున ఈ కేసును బీజేపీ నేత, మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి వాదిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు ఆయన విచారణకు హాజరయ్యారు. పత్రిక ఎండీతో పాటు కేసులో ప్రతివాదులుగా ఉన్న నలుగురు న్యాయకార్య పద్ధతి పాటించకుండా గత ఏడాది డిసెంబర్ 29న రిటర్న్ స్టేట్‌మెంట్‌ను కోర్టులో దాఖలు చేశారని, ఆ స్టేట్‌మెంట్‌ను పరిగణలోకి తీసుకోవద్దంటూ గతంలో సుబ్రమణ్యస్వామి వాదనలు వినిపించారు. అలాగే ఎంపీ సుబ్రమణ్యస్వామి టీటీడీ తరఫున వాదించడానికి అడ్వొకేట్ యాక్ట్ సెక్షన్ 32 కింద ప్రత్యేక అనుమతితో వాదిస్తున్నారని, ఆ అనుమతిని రద్దు చేయాలని పత్రిక తరఫు న్యాయవాది క్రాంతి కుమార్ కోర్టులో కూడా గతంలో పిటిషన్ దాఖలు చేశారు.
Also Read : Transfers In AP: దేవాదాయ శాఖలో సామూహిక బదిలీలు- అర్థరాత్రి జీవో విడుదల
Als Read : AP Tourism: తొట్లకొండ బౌద్ధ క్షేత్రానికి కొత్త అందాలు- ఆకట్టుకోనున్న సరికొత్త టూరిజం స్పాట్