Sirimanotsavam celebrations in Etcherla | ఎచ్చెర్ల: గ్రామ దేవత ఊరేగింపు వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. సిరిమాను విరిగి పడటంతో ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలి గ్రామంలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది.
ఎచ్చెర్ల మండలం కుప్పిలి గ్రామంలో గ్రామ దేవత ఊరేగింపు వేడుకలు జరుగుతున్నాయి. వేడుకకు పెద్ద ఎత్తున స్థానికులు హాజరు కావడంతో సందడి నెలకొంది. ఈ క్రమంలో సిరిమాను ఒక్కసారిగా విరిగి కింద పడింది. సిరిమాను పటడంతో బుడగట్లపాలెంకు చెందిన కారి పల్లేటి(50), అప్పన్న (40) అక్కడికక్కడే మృతిచెందారు. వేడుకల్లో విషాదం జరగడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.