Chandrababu government changed names of various schemes in AP | అమరావతి: ప్రభుత్వాలు మారిన సమయంలో పాత సర్కార్ ప్రవేశపెట్టి అమలు చేసిన పథకాల పేర్లు మార్చడం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పలు పథకాల పేర్లు మార్చింది. గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల పేర్లు మార్చుతూ నిర్ణయం తీసుకుంది. పథకాల పేర్ల మార్పుపై మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు సైతం జారీ అయ్యాయి.


ఏపీలో వివిధ పథకాల పేర్లు మార్చిన కూటమి ప్రభుత్వం


వసతి దీవెన, జగనన్న విద్యాదీవెన పథకాల పేర్లను ‘పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్’ గా మార్పు 


ఎస్సీలకు అమలవుతున్న జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం పేరును అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిగా మార్పు 


వైఎస్సార్ కల్యాణమస్తు పథకాన్ని చంద్రన్న పెళ్లికానుకగా మార్చారు


వైఎస్సార్ విద్యోన్నతి పథకం పేరును ఎన్టీఆర్ విద్యోన్నతిగా మార్పు 


జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం (JCSP) పేరు సివిల్ సర్వీస్ పరీక్ష ప్రోత్సాహకాలుగా చంద్రబాబు ప్రభుత్వం మార్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.