Andhra News  :   ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగుల జీతాల గురించి ప్రతీ సారి చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా తమకు జీతాల బకాయిలు ఇవ్వడం లేదని ముగ్గురు యువకులు పురుగు మందు తాగడం సంచలనంగా మారింది.  తాడేపల్లిలోని స్కిల్ డెవలప్‍మెంట్ ఆఫీస్ ముందు  జీతాల కోసం ఆందోళనకు దిగారు నైపుణ్య అభివృద్ధి సంస్థ ట్రైనీలు. జీతాలు చెల్లించక పోవడంతో ముగ్గురు ఆత్మహత్యాయత్నం చేశారు. నైపుణ్య వికాసం ప్రాజెక్టులో  పనిచేస్తున్నారు వీరు ముగ్గురికి ఎనిమిది నెలల జీతాలు బకాయి ఉన్నాయి. 

ఎనిమిది నెలల పాటు జీతాలివ్వకుండా తొలగించిన ప్రభుత్వం 

స్కిల్  డవలప్మెంట్ కార్పోరేషన్ వీరిని 2016 లో ఇంగ్లీష్, కంప్యూటర్ ట్రైనీలుగా తీసుకొంది. ఒకొక్కరిగి రూ.20 వేలు జీతం ఏర్పాటు చేసింది... 2019 వరకు వీరికి  జీతాలు చెల్లించింది . ప్రభుత్వం మారిన తర్వాత వీరికి జీతాలు నిలిపివేసింది. ఎనిమిది నెలల పాటు సేవలు తీసుకున్న తర్వతా  వేరే ప్రవేట్ కంపెనీ ఈ కోర్స్ లు హైర్ చేసుకోవడంతో వీరిని  చెప్పా పెట్టకుండా ఉద్యోగల నుంచి తొలగించింది.. తొలగించే సమయానికి వీరికి 8 నెలల జీతం బకాయి ఉంది. తొలిగించేటప్పుడు కూడా వారికి రావాల్సిన జీతం బకాయిలు ఇవ్వలేదు. ఎన్ని సార్లు అడిగినా ఇవ్వకపోతూడంటంతో వారంతా ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయారు. 

మరోసారి డీకే శివకుమార్‌తో షర్మిల భేటీ - కాంగ్రెస్ తో పొత్తులు ఫైనల్ అవుతున్నాయా ?

రెండేళ్లుగా ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్న ట్రైనీ లెక్చరర్లు

తమకు రావలసిన బకాయి జీతం కోసం రెండు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు ట్రైనీ లెక్చరర్లు‌.  పలు మార్లు అధికారులను నాయకులను కలసిన ఎవ్వరూ తమ గోడు విన లేదని వారు వాపోయారు.. అప్పడు ఇస్తాం ఇప్పుడు ఇస్తాం అంటూ తమను ఇబ్బందులకు గురి చేసారని అన్నారు..మాకేం సంబంధం అని ఒక సారి...రెండు రోజులలో చెల్లిస్తాం అని మరోసారి మాయమాటలు స్కిల్ డవలప్మెంట్ డైరెక్టర్ చెప్పారని అంటున్నారు... ఈ క్రమంలో ప్రభుత్వం న్యాయం చేయట్లేదని ఆవేశంతో ముగ్గురు  ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్జారు ట్రైనీ లెక్చరర్‌లు... శీతల పానీయలో పురుగులమందు కలిపి తాగారు..హటాత్తుగా జరిగిన సంఘటనతో ఒక్క సారిగా పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది..మంగళగిరి ఎయిమ్స్ కు ముగ్గురు బాధితుల తరలించారు. వారిలో  శ్రీకాకుళం జిల్లా కు చెందిన రంజిత్ పరిస్థితి విషమంగా ఉంది.

ఉచితాలతో ఎన్నికల శంఖారావం పూరించిన టీడీపీ- ఇప్పుడు అదే అసలైన టాస్క్

స్కిల్ డెవలప్‌మెంట్ ఉద్యోగులకు పెద్ద ఎత్తున బకాయిలు                       

గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమాలు చేపట్టారు. అయితే ఇందులో భారీ స్కాం ఉందని .. ప్రభుత్వం ఇటీవల ఆరోపణలు చేసింది. కొన్ని కేసులు నమోదు చేసి అరెస్టులు కూడా చేసింది. ఈడీ కూడా కేసులు నమోదు చేసింది. అయితే ఆ కేసులకూ ఈ ఉద్యోగులకు ఏం సంబంధం లేదని.. కనీసం తమ జీతాలు .. పెండింగ్ జీతాలైనా ఇవ్వాలని వారు బతిమాలుకుంటున్నారు . కానీ ప్రభుత్వం ఆలకించడం లేదు.