Blast Near Golden Temple:


అర్ధరాత్రి బాంబు పేలుడు 


పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో గోల్డెన్ టెంపుల్ వద్ద మరోసారి బాంబు పేలుడు కలకలం సృష్టించింది. ఇలా జరగటం ఇది మూడోసారి. దాదాపు 5 రోజుల వ్యవధిలోనే మూడుసార్లు ఆలయానికి సమీపంలోనే పేలుళ్లు సంభవించాయి. ఇటీవల జరిగిన పేలుడులో ఓ వ్యక్తి స్వల్పంగా గాయపడ్డాడు. ఇప్పుడు మళ్లీ అర్ధరాత్రి పేలుడు సంభవించింది. హెరిటేడ్ స్ట్రీట్‌లో అర్ధరాత్రి 1 గంటకు పేలుడు శబ్దం వినిపించింది. అయితే...ఈ పేలుడు తీవ్రత పెద్దగా లేకపోవడం వల్ల ఎలాంటి నష్టం జరగలేదు. పంజాబ్ పోలీసులు మాత్రం వెంటనే పేలుళ్లపై విచారణ జరిపారు. వీటితో సంబంధం ఉన్న ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఈ నెల మే 6 వ తేదీన తొలిసారి పేలుడు జరిగింది. గోల్డెన్‌ టెంపుల్‌కి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న హెరిటేజ్ స్ట్రీట్‌లోనే వరుస పేలుళ్లు జరిగాయి. ఇప్పటికే NIAతో పాటు ఫోరెన్సిక్ టీమ్‌లు కూడా విచారణ జరిపాయి. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT)కూడా ఈ కేసుని ఛేదించేందుకు తీవ్రంగానే ప్రయత్నించింది. హెల్త్ డ్రింక్ క్యాన్స్‌లో బాంబులు పెట్టి పేల్చినట్టు ప్రాథమిక విచారణలో తేలింది.