అసలే మద్యానికి బానిసయ్యాడు. ఆ పైన తన భార్యను దూరం చేశారని కక్ష పెంచుకున్నాడు. అంతే ఏం చేస్తున్నాడో తెలియని ఆవేశంలో చెలరేగిపోయాడు. చివరికి పిల్లనిచ్చిన మామతో పాటు బావమరిది ప్రాణాలను కూడా రిస్క్‌లో పడేశాడు. సిరిసిల్ల ( Sirisilla ) ముస్తాబాద్ మండలం చిప్పల పల్లి గ్రామంలో కనకయ్య అనే తాగుబోతు హల్ చల్ చేశాడు. ఫుల్లుగా మద్యం తాగి నిమ్మల మల్లయ్యతో పాటు అతని కుమారుడు రాజుపై పెట్రోల్ ( Petrol ) పోసి నిప్పంటించాడు. స్థానికులు అతి కష్టం మీద మంటలు ఆర్పి వారిని ఆస్పత్రికి తరలించారు.
కుమారుడి సెల్‌ఫోన్ కోసం రెండు మేకలు అమ్మింది- అదే ఆ విద్యార్థిని కటకటాల పాల్జేసింది
కనకయ్య ఇంత దురగతానికి పాల్పడటానికి కారణం మద్యం ( Liqor ) . సిద్దిపేటలో ( Siddipet ) కనకయ్య మటన్ వ్యాపారం చేస్తూంటాడు. బుద్దిగా వ్యాపారం చేసుకుంటున్నాడని మల్లయ్య తన కుమార్తె రేణుకను ఇచ్చి వివాహం చేశాడు. అయితే ఇటీవల మద్యానినికి బానిసై.. మటన్ వ్యాపారం మానేసి.. ఏ పనీ పాటా లేకుండా తిరుగడం ప్రారంభించాడు. రేణుక ఒంటిపై ఉన్న బంగారం అంతా అమ్ముకున్నాడు. కనకయ్య వేధింపులు భరించలేక రేణుక పుట్టింటికి చేరుకుంది. బంగారం ( Gold ) కొనెంత వరకు కాపురానికి సిద్దిపేటకు వచ్చేది లేదని తేల్చిచెప్పింది.
బంజారాహిల్స్ డ్రగ్స్ కేసులో కేంద్ర మాజీ మంత్రి అల్లుడు, నిందితులకు 14 రోజుల రిమాండ్
కొన్నాళ్లు భార్య లేకపోయినా గడిపిన కనకయ్య ఇక కష్టం కావడంతో భార్యను కాపురానికి రావాలని అడిగేందుకు ముస్తాబాద్ ( Mustabad )వచ్చాడు. అక్కడ తన కుమార్తెను పెడుతున్న ఇబ్బందులపై మామ నిమ్మల మల్లయ్య కనకయ్యను నిలదీశాడు. అతని కొడుకు రాజు కూడా తన అక్కపై చేస్తున్న వేధింపులపై ప్రశ్నించాడు. దీంతో కోపోద్రిక్తుడైన అల్లుడు కనకయ్య పెట్రోల్ పోసి నిప్పంటించాడు. స్థానికులు వెంటనే మల్లయ్య, రాజులను సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. నిందితుడు కనకయ్యను పోలీసులకు అప్పగించారు.
ఏలూరు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం - రూ.30 కోట్ల మేర ఆస్తి నష్టం !
మద్యానికి బానిసలయిన వారు కుటుంబాలను సైతం విచ్చిన్నం చేసుకుంటున్న ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడటం లేదు. ఎక్కువగా నమోదవుతున్న నేరాల్లో మద్యం మత్తులోనో... మద్యం కారణంగానో జరుగుతున్నాయి. అనేక కుటుంబాలు కూడా విచ్చిన్నమవుతున్నాయి.