Drugs Case Update :   మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తాయి.  అరెస్టైన వెంకట్‌ రత్నారెడ్డి అక్రమాలపై నార్కోటిక్ బ్యూరో ఆరా తీస్తోంది.  వెంకట్ రత్నారెడ్డిపై తెలుగు రాష్ట్రాల్లో కలిపి 25 కు పైగా కేసులు నమోదైనట్లుగా గుర్తించారు. గతంలో  ఐఆర్ఎస్ అధికారినంటూ వెంకట్ మోసాలు చేశారు.  నిర్మాతలు సి. కల్యాణ్‌, రమేష్‌ల నుంచి ఐఆర్‌ఎస్‌ అధికారినంటూ డబ్బులు వసూలు చేసినట్లుగా గుర్తించారు.  నిర్మాతల నుంచి రూ.30 లక్షలకుపైగా కొట్టేసిన వెంకటరత్నారెడ్డి ..  పెళ్లి పేరుతోనూ యువతుల్ని మోసం చేసినట్లుగా గుర్తించారు.  సినిమాలో అవకాశాల పేరిట అమ్మాయిలకు వల వేస్తూ..  
ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను రప్పించి వ్యభిచారం చేస్తున్నట్లుగా గుర్తించారు.                                                   


పెళ్లి పేరుతో ఎన్‌ఆర్‌ఐ నంటూ విదేశీ యువతలను మోసం చేసిన వెంకట్ రత్నారెడ్డి.. తన అక్రమాలకు  ఏపీకి చెందిన ఓ ఎంపీ పేరును ఉపయోగించుకుంటున్నారు. ఇప్పటికే సినిమా ఫైనాన్షియర్ వెంకట్, బాలాజీ కి డ్రగ్స్ మాఫియా తో లింకులు ఉన్నాయని పోలీసు విచారణలో బయటపడింది. తాజాగా ఈ కేసులో నార్కోటిక్స్ బ్యూరో విచారణ కొనసాగుతోంది. సినీ ఫైనాన్సర్ వెంకట్ రత్నా రెడ్డి వాట్సాప్ లో కీలక విషయాలు బట్టబయలయ్యాయి. బాలాజీ, వెంకట్ రత్నారెడ్డి కలిసి డ్రగ్స్ పార్టీలు చేసినట్లు గుర్తించారు. 18 మందికి డ్రగ్స్ ను అమ్మకాలు చేసినట్లు విచారణలో వెల్లడించారు బాలాజీ, వెంకట్. ఆ 18 మంది ఎవరు అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.                                    


గతంలో సినీ నిర్మాత కృష్ణ ప్రసాద్ అరెస్టు తర్వాత మరోసారి టాలీవుడ్ లో డ్రగ్స్ ప్రకంపనలు బయటపడ్డాయి. కృష్ణ ప్రసాద్ లిస్టులో సినీ ప్రముఖులు, రాజకీయ, ఇతర రంగాల వ్యక్తులకు డ్రగ్స్ సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కృష్ణ ప్రసాద్ వ్యవహారంలో సినీ పరిశ్రమకు చెందిన కొందరు పేర్లు జాబితా అప్పట్లో సిద్ధం చేసినప్పటికీ.. దర్యాప్తుకు సిద్ధమైన సమయంలో పై స్థాయి నుండి పోలీసులపై ఒత్తిడి వచ్చింది.                                


2016లలోనే పోలీసులు అతన్ని అరెస్టు చశారు.  ఐఆర్‌ఎస్‌ అధికారిగా నటిస్తూ ఓ సినీ నిర్మాత నుంచి లక్షలు కొల్లగొట్టిన స్కామ్‌లో దొరికిపోయాడు.  దీంతో బంజారాహిల్స్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత వ్యభిచార రాకెట్‌ నడిపాడు. ఆ తర్వాత కార్లను దొంగిలించడం, గుంటూరులోని ఓ బ్యాంకులో చోరీకి ప్రయత్నించడంతోపాటు డబ్బు సంపాదించే క్రమంలో ఇతర నేరాలకు పాల్పడ్డాడు. చివరికి డ్రగ్స్ కేసులో మరోసారి చిక్కాడు.