తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ముక్కుపచ్చలారని ఓ చిన్నారిని కర్కశ తండ్రి అత్యంత దారుణంగా హత్య చేశాడు. భార్యతో గొడవ కారణంగా ఏడాది చిన్నారికి కన్న తండ్రి కరెంట్ షాక్ పెట్టి అత్యంత పాశవికంగా హత్య చేశాడు. అనంతరం తానూ ఆత్మహత్యకు యత్నించాడు. తొగుట మండలం వెంకట్రావుపేటకు చెందిన రాజశేఖర్, సునీత దంపతులు. వీరికి సుమారు ఏడాది వయస్సున్న పాప ప్రిన్స్ ఉంది. దంపతుల మధ్య ఘర్షణ రావడంతో భార్యను కొట్టి తండ్రి రాజశేఖర్ చిన్నారిని పొలం వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ చిన్నారికి కరెంట్ షాక్ పెట్టి హత్య చేశాడు. అనంతరం ఇదే తన చివరి కాల్ అంటూ ఓ రైతుకు ఫోన్ చేసి చెప్పాడు.
Also Read: బుల్లెట్టు బండెక్కి వచ్చాడు.. సూసైడ్ లెటర్ రాసి పోయాడు.. ఇంతలోనే మతిపోగొట్టే ట్విస్ట్!
కుటుంబ కలహాలతో దారుణం
సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేటలో ఈ దారుణం చోటుచేసుకుంది. భార్యాభర్తలు గొడవ పడి 11 నెలల చిన్నారిని కరెంట్ షాక్ పెట్టి హత మార్చిన ఘటన గ్రామస్తులను కలచివేసింది. వెంకట్రావుపేటకు చెందిన మిరుదొడ్డి రాజశేఖర్ దౌల్తాబాద్ మండల కేంద్రానికి చెందిన సునీతను రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. కొంత కాలం వారి కాపురం సజావుగానే సాగింది. 11 నెలల క్రితం పాప జన్మించిన తర్వాత సునీత, రాజశేఖర్ తరచూ ఘర్షణ పడేవారు. దీంతో ఇరు గ్రామాలకు చెందిన పెద్దలు వారికి సర్దిచెప్పి కలిసుండాలని నచ్చజెప్పారు. సునీత, అత్తమామలకు మధ్య గొడవకు దారితీసే అవకాశం ఉంటే వేరు కాపురం పెట్టాలని గ్రామ పెద్దలు సూచించారు. వేరు కాపురం పెడదామని సునీత కోరగా రాజశేఖర్ అందుకు నిరాకరించడంతో గొడవలు మొదలయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం మరోసారి గొడవ జరగడంతో భార్య సునీతను కొట్టి పాపను వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత విద్యుత్ షాకిచ్చి చంపేశాడు. పాప చనిపోయిన తర్వాత రాజశేఖర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అతడిని కుటుంబ సభ్యులు గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Also Read: వీడియో కాల్ ఎత్తగానే నగ్నంగా కనపడ్డ యువతి.. టెంప్ట్ అయిన టెకీ, తాను కూడా.. చివరికి..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి