Telangana Cellphones Recovery: ఇటీవల ఖరీదైన ఫోన్ల వాడకం పెరిగింది. ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉండటం మామూలు విషయం అయిపోయింది.  ఈ రోజుల్లో వినియోగదారులు ఫోన్‌లను పోగొట్టుకోవడంతోపాటు చోరీలూ ఎక్కువయ్యాయి. దీంతో ఫోన్ పోగొట్టుకున్నామంటూ బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఆయా పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో సెల్‌ఫోన్‌(Cellphones)లకు సంబంధించి కేసులు భారీగా పెరిగిపోతున్నాయి.  సీడీఆర్‌ పెట్టినా దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు (Telangana Police) నూతన సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సీఈఐఆర్‌ (సెంట్రల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ రిజిస్టర్‌) విధానంతో సెల్‌ఫోన్‌లను రికవరీ చేసి వినియోగదారులకు తిరిగి అందజేస్తున్నారు. 


రెండో స్థానంలో తెలంగాణ
చోరీకి గురైన సెల్‌ఫోన్లు రికవరీ చేయడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. చోరీకి గురైన లేదా పొరపాటున పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌ ఫోన్లను ట్రేస్‌ చేసి, వాటిని యజమానులకు అప్పగించడంలో తెలంగాణ పోలీసులు తమ సత్తా చాటుతున్నారు. తాజాగా సెల్‌ఫోన్‌ రికవరీలో (Cellphones Recovery) తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి జులై 25 వరకు 21,193 సెల్‌ఫోన్లు రికవరీ చేశారు. సెల్ ఫోన్ల దొంగతనాలను అరికట్టేందుకు టెలికమ్యూనికేషన్ల శాఖ సిఈఐఆర్ (సెంట్రల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ రిజిస్టర్‌)  పోర్టల్‌ను అభివృద్ధి చేసింది. ఈ పోర్టల్‌ను గతడాది మే 17న దేశ వ్యాప్తంగా ప్రారంభించారు. 


2023 ఏప్రిల్ నుంచి ప్రారంభం
ఇక తెలంగాణ రాష్ట్రంలో దీన్ని 2023 ఏప్రిల్ నుంచి ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా  ఉన్న  780 పోలీస్ స్టేషన్లలో ఈ పోర్టల్‌ ద్యారా ఫిర్యాదులను పోలీసులు స్వీకరిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు చోరీకి గురైన 21,193 సెల్ ఫోన్లను రికవరీ చేయడంలో పోలీసులు సక్సెస్ సాధించారు.  గత ఎనిమిది రోజుల్లోనే 1000 ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేశారు. ప్రతిరోజు సుమారు 82 సెల్ ఫోన్లను రికవరీ చేస్తున్నామని ఉన్నాతాధికారులు వెల్లడించారు. సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వారు www.tspolice.gov.in లేదా www.ceir.gov.in వెబ్‌సైట్‌ల ద్వారా పిర్యాదు చేయాలని కోరారు. 
Also Read: Revanth Reddy: కల్వకుర్తికి సీఎం రేవంత్ రెడ్డి వరాలు, తాను చదువుకున్న స్కూల్‌కు సైతం రూ.5 కోట్లు ప్రకటన


మొదటి స్థానంలో  కర్ణాటక
ఇది ఇలా ఉంటే సీఈఐఆర్‌  పోర్టల్‌ ప్రారంభించిన 396 రోజుల్లో 35,945 సెల్‌ఫోన్స్‌ రివకరీలో కర్నాటక(Karnataka) రాష్ట్రం మొదటి స్థానంలో కొనసాతుండగా 7387 సెల్‌ఫోన్స్‌ రికవరీల్లో ఆంధ్రప్రదేశ్‌ నాలుగో స్థానంలో నిలిచింది. ఇక తెలంగాణ రాష్ట్రంలోనే నిజమాబాద్ జిల్లాలోని ఒకటో టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ మొదటి స్థానంలో నిలిచింది. ఒకటో టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సీఈఐఆర్‌ పోర్టల్ ద్వారా 1432 దరఖాస్తులు రాగా ఇందులో 904 సెల్‌ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. మిగతా 499 ఫోన్‌లను బ్లాక్‌ చేశారు. మరో 29 ఫోన్‌లను బాధితులకు అందించాల్సి ఉంది. ఇటీవల కాలంలో భారీగా మొబైళ్ల దొంగతనాలు జరుగుతున్నాయి. మొబైల్ పోయిన వెంటనే మీసేవలో అప్లై చేసుకోవాలి. సీఈఐఆర్‌ (CEIR) పోర్టల్ లో ఫిర్యాదు చేయాలని పోలీసులు తెలిపారు. 


Also Read: KTR: ఢిల్లీలో సివిల్ సర్వీస్ అభ్యర్థుల మృతి, తెలంగాణ ప్రభుత్వాన్ని అలర్ట్ చేసిన కేటీఆర్