భద్రాద్రి కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు కుమారుడు వనమా రాఘవేంద్రకు స్థానిక కోర్టు రిమాండ్ పొడిగించింది. మరో 14 రోజులు రిమాండ్ గడువు పెండింది. ఇవాళ్టితో రిమాండ్ గడువు ముగియడంతో జైలు అధికారులు కోర్టులో వర్చువల్‌గా రాఘవను హాజరుపరిచారు. కొత్తగూడెం రెండో అదనపు జ్యుడీషియల్ కోర్టులో వాదనలు జరిగాయి. అనంతరం ఆయనకు ఫిబ్రవరి 4 వరకు రిమాండ్ గడువు పొడిగిస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నాగరామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఉదంతంలో ప్రధాన సూత్రధారిగా వనమా రాఘవ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. రాఘవ బెదిరింపులకు తట్టుకోలేక నాగరామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడటంతో ఒక్కసారిగా రాఘవ అరాచకాలపై అందరి దృష్టి పడింది. మీడియాతోపాటు సామాజిక మాద్యమాల్లో రాఘవ నేరాకృత్యాలపై విమర్శలు రావడంతో పోలీసులు పరుగులు పెట్టారు. రాఘవకు సంబంధించిన కేసులపై దృష్టి సారించారు. పెండింగ్ కేసుల విచారణ వేగవంతం చేశారు. ఈ మేరకు పాల్వంచ ఏఎస్సీ, ఐపీఎస్ అధికారి రోహిత్ రాజ్ రాఘవపై 12 కేసుల్లో తీవ్ర నేరారోపణలు ఉన్నాయని, అతనిపై రౌడీషీట్ నమోదు చేస్తామని ప్రకటించారు.
Also Read: ఆస్తి తగాదాలు.. అక్రమ సంబంధాలు.. రామకృష్ణ మరో సెల్ఫీ వీడియో వైరల్
రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య