తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన నిజామాబాద్‌లో యువతిపై అత్యాచార ఘటనను పోలీసులు చేధించారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం ఆరుగురిని అరెస్టు చేశామని వెల్లడించారు. నిన్న ఐదుగురిని.. ఈరోజు ఉదయం ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలించామని నగర పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ చెప్పారు. నగరంలోని బస్టాండ్ సమీపంలో మరమ్మతుల్లో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రి భవనంలో యువతిపై నిన్న (బుధవారం) సామూహిక అత్యాచారం జరిగిందని నిర్ధారించారు. నగరానికి చెందిన నవీన్‌ కుమార్‌ అనే వ్యక్తితో వెళ్లిందని, అతడితో పాటు మరో ఇద్దరు ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపారు. దీనికి మరో ముగ్గురు సహకరించారని పేర్కొన్నారు. 


Also Read: కుళ్లిన స్థితిలో నటి శవం.. గది నుంచి తీవ్ర దుర్వాసన, ఏం జరిగిందంటే..


100కి కాల్ రావడంతో.. 
నిన్న రాత్రి ఒంటి గంట తర్వాత డయల్‌ 100 నంబరుకి కాల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. 18 ఏళ్ల యువతి ఉందనే తమకు సమాచారం అందించారని పేర్కొన్నారు. రాత్రి మాట్లాడే పరిస్థితిలో లేకపోవడంతో ఆమెను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించామని చెప్పారు. ఆమె కాస్త కోలుకున్నాక సఖి కేంద్రానికి పంపామని వివరించారు. ఈ నెల 28న బాధిత యువతి నవీన్‌ కుమార్‌ అనే వ్యక్తిని కలిసినట్లు గుర్తించామని అన్నారు. అతను యువతినిన నిర్మాణంలో ఉన్నఆస్పత్రి వైపు తీసుకెళ్లాడని.. అక్కడ ముగ్గురు అత్యాచారం చేసినట్లు వెల్లడించారు. 


Also Read: పని మనిషిపై వంట మనిషి దాష్టీకం.. బలవంతంగా రూంలోకి లాక్కెళ్లి రేప్


నిజామాబాద్ ఘటనపై కవిత సీరియస్.. 
నిజామాబాద్‌లో సంచలనం రేపిన యువతిపై అత్యాచారం ఘటనపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ ద్వారా స్పందించారు. యవతిపై అత్యాచారం జరగడం చాలా బాధాకరమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదని కవిత స్పష్టం చేశారు. 24 గంటల్లో నిందితులను అరెస్ట్ చేసిన పోలీస్ శాఖకు ఈ సందర్భంగా ఆమె అభినందనలు తెలిపారు. సీఎం కేసీఆర్ అన్ని జిల్లాల్లో షీ టీంలను ఏర్పాటు చేసి, ఆడ బిడ్డలకు భరోసా ఇస్తున్నారని పేర్కొన్నారు. మహిళలపై వివక్ష చూపినా, అఘాయిత్యాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏ మాత్రం వెనకడుగు వేయదని స్పష్టం చేశారు. నిజామాబాద్‌లో అత్యాచారానికి గురైన బాధితురాలికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున.. వ్యక్తిగతంగానూ అన్ని రకాలుగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. 


Also Read: భర్తను కిడ్నాప్ చేయించిన భార్య.. కారణం తెలిసి పోలీసులు షాక్


Also Read: డ్రగ్స్‌ అమ్ముతూ పట్టుబడిన సూర్య 'సింగం' నటుడు 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి