అక్రమ సంబంధాన్ని భర్త బహిర్గతం చేయడంతో.. పేగు తెంచుకుని పుట్టిన పిల్లలను హింసించి రాక్షసానందం పొందుతున్న 23 ఏళ్ల మహిళను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. రెండేళ్ల చిన్నారిని కొడుతున్న సమయంలో తీసిన వీడియోలు వైరల్ కావడం తెలిసిందే. ఈ క్రమంలో చిత్తూరు జిల్లాకు వచ్చిన ప్రత్యేక పోలీసుల టీమ్ ఆ మహిళను అదుపులోకి తీసుకుంది. ఈ విషయాన్ని తమిళనాడు విల్లుపురం జిల్లా ఎస్పీ డా. ఎన్ శ్రీనాథ మీడియాకు తెలిపారు.


చిత్తూరు జిల్లాలకు చెందిన తులసి అనే వివాహిత ప్రియుడి మోజులో పడి సంసారాన్ని నాశనం చేసుకోవడమే కాకుండా, ప్రియుడి కోసం కన్నబిడ్డలకు నరకం చూపించింది. రెండో కుమారుడిని చిత్రహింసలు పెడుతున్న సమయంలో వీడియోలు సైతం తీసింది. చిన్నారి ప్రదీప్‌ను ముఖం పై భాగంలో చేతితో గట్టిగా కొట్టగా బాలుడి నోటి నుంచి రక్తం కారుతున్న వీడియో నెటిజన్లను సైతం కదిలించింది. ఆ మహిళను వెంటనే అరెస్ట్ చేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎం ఎంకే స్టాలిన్ సైతం ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. ఆయన ఆదేశాలతో చిత్తూరుకు వచ్చిన స్పెషల్ పోలీస్ టీమ్ తులసిని అదుపులోకి తీసుకుంది.


Also Read: ప్రియుడి మోజులో రెండేళ్ల బిడ్డను చితకబాదిన తల్లి.. 250 ఆ వీడియోలు వైరల్.. ఈ కేసుపై సీఎం సీరియస్




అసలేం జరిగిందంటే..
చిత్తూరు జిల్లా రాంపల్లెకు చెందిన తులసిని తమిళనాడులోని విల్లుపురం జిల్లా సత్యమంగళం మండలం మెట్టూరు గ్రామానికి చెందిన వడివేళన్‌కు ఇచ్చి ఆరేళ్ల కిందట వివాహం చేశారు. వీరికి సంతానం ఇద్దరు చిన్నారులు గోకుల్, ప్రదీప్ ఉన్నారు. గోకుల్ వయసు నాలుగేళ్లు కాగా, రెండో చిన్నారి వయసు రెండేళ్లు. రైతు కావడంతో వడివేళన్ పొలంలో అధిక సమయం గడిపేవాడు. అయితే భర్త కష్టాన్ని గుర్తించని తులసి ఎప్పుడూ స్మార్ట్‌ఫోన్ తో కాలక్షేపం చేసేది. ఈ క్రమంలో ఓరోజు కాస్త పరిచయం ఉన్న వ్యక్తిని ఆమె కలుసుకుంది. ఇద్దరూ నెంబర్లు పరస్పరం ఇచ్చి పుచ్చుకున్నారు. ఇక అది మొదలు వారు వాట్సాప్ లో చాటింగ్ చేసేవారు. గంటల తరబడి ఫోన్లో మాట్లాడుకునేవాళ్లు. వీరి పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. 


భార్య తులసి ప్రవర్తన మారడంతో ఆమెను గమనించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ప్రియుడితో ఏకాంతంగా గడుపుతున్న సమయంలో వారిద్దరూ వడివేళన్‌కు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఇలాంటి పనులు మానుకోవాలని ఇద్దర్నీ హెచ్చరించాడు. పిల్లల కోసమైనా మారాలని భార్య తులసికి సూచించాడు. అయితే రెండో కాన్పు సమయంలో ఆమెకు అనారోగ్య సమస్య రావడాన్ని గుర్తు చేసుకుంది. ప్రియుడి కోరిక మేరకు రెండో కుమారుడు ప్రదీప్‌పై కక్ష పెంచుకుని.. తాను కన్నతల్లినని మరిచిపోయి క్రూరంగా ప్రవర్తించింది. ప్రదీప్‌ను ప్రతిరోజూ కొడుతుండేది. మరోవైపు ప్రియుడితో తన సంబంధాన్ని అలాగే కొనసాగించింది. 


Also Read: Pocso Case: యువతిపై పోక్సో కేసు నమోదు... మైనర్ తో ఆ పనిచేసినందుకే... రిమాండ్ విధించిన కోర్టు


చిన్న కుమారుడు పదే పదే అనారోగ్యానికి గురవుతున్నాడని వడివేళన్ ఆందోనకు గురయ్యాడు. భార్య ప్రవర్తన మారకపోవడంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండో బాబు ప్రదీప్‌ను ముఖంపై తన బలంకొద్ది కొడుతూ చిత్రహింసలకు గురిచేసింది. ఈ తతంగాన్ని ఆ మహాతల్లి వీడియోలు కూడా తీసింది. 250కు పైగా వీడియోలు ఇలాంటివి తీయడంతో వడివేళన్ ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. పిల్లలు తనవద్దే ఉండటంతో వారిపై చెప్పులతో సైతం దాడికి పాల్పడేది. చిన్నారి ముఖం, నోటిపై కొడుతుండగా నోటి నుంచి రక్తం కారి ప్రదీప్ ఏడుస్తున్నా కనికరించలేదు. ఆ వీడియోలు వైరల్ కావడంతో తమిళనాడు పోలీసుశాఖ, సీఎం స్టాలిన్ స్పందించారు. కేసు నమోదు చేసి తులసిని అరెస్ట్ చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. స్పెషల్ టీమ్ చిత్తూరుకు వెళ్లి తులసిని అరెస్ట్ చేసి, తమిళనాడుకు తరలిస్తోంది. చిన్నారులను తండ్రి వడివేళన్‌కు అప్పగించినట్లు సమాచారం.