కట్టుకున్న బంధాన్ని..పేగు తెంచుకుని పుట్టిన అనురాగాన్ని కాదనుకుని ప్రియుని మోజులో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు కొందరు వివాహితలు. పెళ్ళి చేసుకుని సంసార జీవితాన్ని సాగిస్తున్న సమయంలో చెడు సహవాసాల ద్వారా వేరే మగవారితో పరిచయాలు పెంచుకుని కుటుంబ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అలా ఓ వివాహిత గుట్టుగా చేస్తున్న అక్రమ సంబంధాన్ని భర్త బహిర్గతం చేయడంతో కక్ష కట్టిన భార్య.. లోక జ్ఞానం తెలియని చిన్నారిపై తన పైశాచికత్వాన్ని ప్రదర్శించింది. అంతటితో ఆగకుండా తాను కన్న బిడ్డను క్రూరంగా దాడి చేసిన సంఘటనలను వీడియోలుగా తీసింది.
చిత్తూరు జిల్లా రాంపల్లెకు చేందిన తులసీని తమిళనాడులోని విల్లుపురం జిల్లా, సత్యమంగళం మండలం, మెట్టూరు గ్రామానికి చేందిన వడివేళన్ కు ఆరేళ్ల కిందట ఇచ్చి వివాహం చేశారు. వీరికి గోకుల్, ప్రదీప్.. పిల్లలు ఉన్నారు. అయితే వడివేళన్ సాధారణ రైతు కావడంతో నిత్యం పొలంలోనే అధిక సమయాన్ని కేటాయించే వాడు. తులసీ చేతిలో ఫోన్ పట్టుకుని ఇంట్లోనే ఉండేది. ఇలా ఒక రోజు తెలిసిన వ్యక్తిని అనుకోకుండా కలిసింది. ఒకరి ఫోన్ నెంబర్ లు మరోకరు ఇచ్చి పుచ్చుకున్నారు. వీరి మధ్య తరచూ వాట్సప్ చాటింగ్ తో పాటుగా ఫోన్లు మాట్లాడుకునేవాళ్లు.
ఇలా సాగుతున్న వీరి ప్రయాణం అక్రమ సంబంధానికి దారి తీసింది. పొలం పనుల నుంచి ఇంటికి వచ్చిన భర్తను పట్టించుకోకుండా ఫోన్ లో నిమగ్నం అయ్యేది తులసీ. ఒకానోక రోజు ప్రియుడితో ఏకాంతంగా ఉన్న తులసీని చూసి భర్త వడివేళన్ భార్యను మందలించాడు. ఇలాంటి పనులు మానుకోమని హెచ్చరించాడు. తనకు నచ్చిన వ్యక్తితో వేరు చేసే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్పింది తులసీ.
అయితే కొద్ది రోజులు ప్రియుడికి దూరంగా ఉన్నట్లు నటిచింది. తనలో మార్పు వచ్చినట్లు కనపడడంతో మళ్ళీ వడివేళన్ చూసి చూడనట్లు ఉండే వాడు. అదే అదునుగా అనుకున్న తులసీ ప్రియుడితో మాట్లాడుతూనే కన్న బిడ్డలపై విరుచుకు పడేది. వారికి తీవ్రంగా గాయాలైనా వదిలేది కాదు. ఇలా తన రెండేళ్ల కుమారుడిపై దాడి చేసిన ప్రతి సారి వీడియోలను చిత్రీకరించేది. అమ్మ కొట్టిందని కనీసం చెప్పలేని స్ధితి ఆ చిన్నారిది. ఒకానోక రోజు ఆ చిన్నారి నోటిలో నుండి రక్తం ధారగా రావడం గమనించిన వడివేళన్ ఆసుపత్రికి తీసుకెళ్ళి చికిత్స చేయించాడు.
చిన్నారులను చిత్రహింసలకు గురి చేసిన 250 వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలల్లో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ నోట ఈ నోట చేరిన ఈ విషయం సీఎం స్టాలిన్ దృష్టికి వెళ్లింది. ఈ కేసుపై సమగ్ర విచారణ జరిపించాలని స్టాలిన్ ఆదేశాలు జారీ చేశారు. మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తులసీ ఆచూకీ కోసం చిత్తూరు జిల్లాలో గాలింపు చర్యలు చేపట్టారు. చౌడేపల్లె మండలం అన్నిపల్లె గ్రామంలో ఓ కోళ్లఫారంలో తులసీ పని చేస్తుండగా తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read: మేనత్తను లవ్ చేసిన అల్లుడు.. గర్భం దాల్చిందని ఇంట్లో తెలిసింది.. చివరకు వారి ప్రేమ కథ ఏమైంది?