TalkCharge Scam  Users of 5,000 Crore with Cashback Promise : డిజిటల్ వాలెట్స్ వచ్చిన తర్వాత క్యాష్ బ్యాక్ అనే పదం కామన్ అయిపోయింది. కొత్త కొత్త కంపెనీలు పుట్టుకు వచ్చి తమ వ్యాలెట్ల నుంచి చెల్లింపులు చేస్తే పెద్ద ఎత్తున క్యాష్  బ్యాక్ ఇస్తామని ఆఫర్లు ఇవ్వడం ప్రారంభించాయి. ఇలానే ప్రారంభమైన అ కంపెనీ.. ప్రజల దగ్గర నుంచి ఐదు వేల కోట్లు వసూలు చేసి జెండా ఎత్తేసింది. 


గుర్గావ్ లో టాక్‌చార్జ్ అనే కంపెనీని అంకుష్ కతియార్ అనేవ్యక్తి ప్రారంభించాడు. ఇది బేసిక్ గా వ్యాలెట్ సేవలు అందించే కంపెనీ. వ్యాలెట్లలో రీచార్జ్ చేసుకుంటే.. తమ కంపెనీ వాలెట్ లో డిపాజిట్ చేస్తే వడ్డీతో పాటు పెద్ద ఎత్తున క్యాష్ బ్యాక్ ఇస్తామని ప్రచారం చేసుకుంది.  విపరీతంగా ప్రచారం లభించడంతో.. ఈ టాక్ చార్జ్ వ్యవహారం హాట్ టాపిక్ అయింది. పెద్ద ఎత్తున జనం.. తమ దగ్గర ఉన్న డబ్బుల్ని ఇందులో డిపాజిట్ చేయడమో.. రీచార్జ్ చేయమో చేసుకున్నారు. రూ. 4999 డిపాజిట్ చేస్తే రూ. 1666 క్యాష్ బ్యాక్ ఇస్తామని.. అదే ఏడున్నర లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే రూ. 59,999 వెంటనే  టాక్ చార్జ్ వాలెట్ లో వేస్తామని ఆశ పెట్టారు.                                  


ఓలా బైక్‌ కస్టమర్ పిచ్చిపని! కంపెనీపై కోపంతో షోరూంలో పెట్రోల్‌ పోసి నిప్పు


మొదట కొంత మందికి ఇవ్వడంతో మౌత్ టాక్ ప్రారంభమయింది. ఇలా ప్రజల వద్ద నుంచి వేల కోట్లు వసూలు చేసింది. తర్వాత మెల్లగా డిపాజిట్లతో పాటు టాక్ చార్జ్ వాలెట్లు కూడా పని చేయడం ఆగిపోయాయి.  దీంతో బాధితులు లబోదిబోమన్నారు. ఆర్బీఐ కూడా ఈ కంపెనీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల వద్ద సేకరించిన డిపాజిట్లనను వారికి ఇచ్చేయాలని గత ఏప్రిల్ లో ఆదేశించింది. కానీ ఈ కంపెనీ డబ్బులు తిరిగివ్వలేదు.  


ఈ టాక్ చార్జ్ ద్వారా చేసిన  చెల్లింపులు నిజంగా వెండర్స్ కూడా చేరలేదు . అంటే.. ఓ కంపెనీ  కరెంట్  బిల్లు  లేదా.. మరో చోట ఎక్కడైనా  చెల్లింపులు చేసినా.. యాప్ లో సక్సెస్ అని చూపించినా.. అసలైన వెండర్స్ కు మాత్రం చేరలేదు. మార్చిలో మొత్తం విత్ డ్రాయల్స్ సర్వీసును కంపెనీ ఆపేసింది. ఈ కంపెనీ మోసంపై అనేక మంది బాధితులు మీడియాను ఆశ్రయించారు. పోలీసులు ఈ కంపెనీపై కేసు పెట్టి విచారణ చేస్తున్నారు. అయితే  ఇప్పటికే ప్రజల వద్ద నుంచి వసూలు చేసిన ఐదు వేల కోట్లు దారి మళ్లించి ఉంటారని అనుమానిస్తున్నారు. 


గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల రేవ్ పార్టీ, 26 మంది యువతీయువకులు అరెస్టు


ఆన్ లైన్ ఫ్రాడ్ కంపెనీల బారిన పడిన వారు సర్వం పోగొట్టుకంటారు. అంతా పోయిన తర్వాత కానీ వారికి అసలు విషయం అర్థం కాదు.