Students Seriously Ill In Chintal Sri Chaitanya School: కుత్బుల్లాపూర్ చింతల్‌లోని శ్రీచైతన్య పాఠశాలలో (Sri Chaitanya School) శనివారం విషాదం జరిగింది. మూడో అంతస్తులోని బాత్రూంలో ప్రమాదవశాత్తు యాసిడ్ బాటిల్ కింద పడగా.. ఆ సమయంలో అక్కడ ఉన్న విద్యార్థులు ఘాటు వాసనకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాదాపు 40 మంది విద్యార్థులు వాంతులు చేసుకున్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పాఠశాల యాజమాన్యం విద్యార్థులందరినీ వెంటనే ఆస్పత్రికి తరలించింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. తమకు కనీసం సమాచారం ఇవ్వకుండా స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు. ఈ క్రమంలో గందరగోళం నెలకొనగా యాజమాన్యం విద్యార్థులందరినీ ఇంటికి పంపేసింది.
'విద్యార్థులంతా సేఫ్'
ఈ ఘటనలో విద్యార్థులంతా సేఫ్‌గా ఉన్నారని.. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని స్కూల్ ప్రిన్సిపాల్ తెలిపారు. సిబ్బంది బాత్రూం శుభ్రం చేస్తోన్న సమయంలో యాసిడ్ బాటిల్ కింద పడిందని.. ఆ వాసనకు విద్యార్థులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారని చెప్పారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందని స్పష్టం చేశారు.
Also Read: Earthquake: తెలంగాణలో మరోసారి భూ ప్రకంపనలు - మహబూబ్‌నగర్ జిల్లాలో భూకంప కేంద్రం