Srikakulam Crime News: శ్రీకాకుళం పట్టణంలో దారుణ ఘటన జరిగింది.  కుటుంబ కలహాలతో(Family Disputes) ఇద్దరు చిన్నారులకు ఉరి(Hang) వేసి చంపిందో కన్న తల్లి, ఆ తర్వాత తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శ్రీకాకుళం(Srikakulam) పట్టణంలోని దమ్మల వీధిలో నివాసం ఉంటున్న  పేర్ల ధనలక్ష్మి, తన పిల్లలు పేర్ల సోనియా, యశ్వంత్ తో సహా ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలతో గత ఆరేళ్లుగా ధనలక్ష్మి అమ్మగారింట్లోనే ఉంటుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని  దర్యాప్తు చేస్తున్నారు. 


కుటుంబ కలహాలతో తీవ్ర నిర్ణయాలు 


కుటుంబ కలహాలు దారుణ సంఘటనలకు దారితీస్తున్నారు. భర్త మీద కోపం లేదా భార్య పై అనుమానం ఇలా కారణం ఏదైనా సరే చిన్నారుల ప్రాణాలు బలితీసుకుంటున్నాయి. కనీసం జీవితం అంటే ఏమిటో కూడా తెలియని చిన్నారులను కిరాతంగా తల్లిదండ్రులే పొట్టనపెట్టుకుంటున్నారు. పిల్లలను చంపి ఆపై ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు తరచూ వింటున్నాం. భర్తపై కోపంతో పిల్లల్ని చంపి ఆపై ఆత్మహత్య చేసుకున్న తల్లి, కుటుంబ కలహాలతో పిల్లల్తో సహా చెరువులో దూకిన తల్లి అన్న వార్తలు నిత్యం ఎక్కడో ఒక చోట కనిపిస్తున్నాయి. కారణాలు ఏమైనా ముక్కుపచ్చలారని చిన్నారులను చంపుతున్నారు. ఆత్మహత్య చేసుకోడానికి ఉన్న ధైర్యాన్ని బతకడానికి చూపించలేకపోతున్నారు. తమ కోపాలను పిల్లలపై చూపిస్తూ అన్యం పుణ్యం ఎరుగని చిన్నారులను హత్య చేస్తున్నారు. 


నిజామాబాద్ లో దారుణ ఘటన


తల్లిదండ్రుల వివాహేతర సంబంధాలు, ఆగ్రహావేశాలకు చిన్న పిల్లలు బలైపోతున్నారు. ప్రియుళ్లతో కలిసి కన్నబిడ్డల్ని తల్లులే హతమార్చిన ఘటనలు మర్చిపోకముందే నిజామాబాద్ జిల్లాలో ఓ తల్లి దారుణానికి పాల్పడింది. భర్తపై కోపంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఆమె చిన్నారులు ఇద్దరితో కలిసి కాలువలోకి దూకింది. తర్వాత తల్లి ప్రాణ భయంతో పైపును పట్టుకుని ప్రాణాలతో బయటపడింది. పిల్లలు కాలువలో ఊపిరాడక మరణించారు. నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండలం దొంచంద గ్రామానికి చెందిన పల్లపు శ్రీనివాస్‌కు నందిపేటకు చెందిన సోనితో నాలుగేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి మనుశ్రీ (3), మనుతేజ (6 నెలలు) ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లి తర్వాత నందిపేటకు వచ్చేసిన శ్రీనివాస్ ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఇటీవలే సొంతగా ట్రాక్టర్ కొనుక్కున్నాడు. ఈ ట్రాక్టర్ విషయంలో భార్యభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. అప్పు చేసి ట్రాక్టర్ కొనడం ఎందుకని సోని గొడవ పడింది. ఈ గొడవ కారణంగా ఆమె పిల్లలతో సహా కాలువలో దూకింది.