Shamshabad Gold Seize : శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారాన్ని పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన ప్రయాణికులను తనిఖీలు చేయగా వారి వద్ద బంగారాన్ని గుర్తించారు అధికారులు. దుబాయ్ నుంచి వచ్చిన ముగ్గురి వద్ద అక్రమంగా తరలిస్తున్న 7 కిలోల గోల్డ్ ను గుర్తించారు. దీంతో బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం  చేసుకున్నారు. బంగారాన్ని కడ్డీల రూపంలో తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ స్మగ్లింగ్ బంగారం  విలువ రూ.3.50 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. ముగ్గురు ప్రయాణికులను అదుపులోకి తీసుకుని విచామరిస్తున్నామని వెల్లడించారు. బంగారానికి సిల్వర్ కోటింగ్ వేసి హైదరాబాద్ తరలిస్తుండగా  అధికారులు పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని స్కానింగ్ లో గుర్తించారు.  






రెక్టమ్ లో గోల్డ్ 


ఈకే 329 విమానంలో బ్యాంకాక్ నుంచి వచ్చిన ఒక వ్యక్తిని హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించారు. అతను బంగారాన్ని రెక్టమ్ లో  దాచిపెట్టి పేస్ట్ రూపంలో స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అతడు అక్రమంగా తీసుకొచ్చిన మొత్తం 865.6 గ్రాముల బంగారం విలువ రూ. 46.05 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. మరో ఘటనలో  హైదరాబాద్ కస్టమ్స్ మహిళా ప్రయాణికురాలను అదుపులోకి తీసుకున్నారు. ఆమె అండర్‌గార్మెంట్స్‌లో పేస్ట్ రూపంలో దాచిపెట్టిన 435 గ్రాముల బంగారాన్ని అక్రమంగా తరలిస్తుంది. పట్టుబడిన బంగారం విలువ రూ. 22.40 లక్షలు ఉందని అధికారులు తెలిపారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో తరచూ బంగారం పట్టుకుంటున్నారు కస్టమ్స్ అధికారులు. బంగారాన్ని వివిధ రూపాల్లోకి మార్చి స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడుతున్నారు. 






Also Read : హైదరాబాద్‌ మొబైల్‌ బంగ్లాదేశ్‌కు- చోరీ గ్యాంగ్‌ను పట్టుకున్న పోలీసులు


Aslo Read : Warangal: చినుకుల వేళ దోస్తులతో మందు సిట్టింగ్, ఇంతలో ఊహించని ఘటన - ముగ్గురూ మృతి