Telangana News: తన మరదలిపై కన్నేశాడని తన మిత్రులతో కలిసి యువకుడిని అతి దారుణంగా హత్య చేశారు. సికింద్రాబాద్ బేగంపేటలోని పాటి గడ్డలో ఈ దారుణం చోటు చేసుకుంది. పాటిగడ్డకు చెందిన ఉస్మాన్ అనే యువకుడు స్థానిక యువతిని ప్రేమిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి బావ అజజ్.. తన మరో ముగ్గురు మిత్రులతో కలిసి యువకుడిని హత్య చేశాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. స్థానిక పాటి గడ్డలో రాత్రి సమయంలో ఆ యువకుడిని ఈ నలుగురు నిందితులు కలిసి అడ్డగించారు. అలా నలుగురు కలిసి అతనిపై కత్తులతో దాడి చేసి విచక్షణారహితంగా చంపేశారు. 


అతని ప్రాణం పోయిన తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయారు. హత్య జరిగిన ప్రాంతాన్ని నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ తోపాటు పలువురు పోలీసు ఉన్నత అధికారులు పరిశీలించారు. క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసుకున్న బేగంపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు పాల్పడిన అజజ్, ఫిరోజ్, సాహిల్, రెహన్ ను పోలీసులు అరెస్టు చేశారు. హత్య గురించి విచారణ చేస్తున్నారు.