Andhra Pradesh News: వైద్యో నారాయణో హరి అంటారు. ఈ ప్రపంచంలో దేవుడు తర్వాత ప్రతి ఒక్కరూ ఆయనతో సమానంగా చేతులెత్తి మొక్కేది వైద్యులకు మాత్రమే.  అత్యవసర పరిస్థితుల్లో ఊపిరి నిలిపే డాక్టర్లంటే దేవుడితో సమానంగా భావిస్తారు. అందుకే వారిని ప్రాణదాతలుగా భావించి చేతులెత్తి మొక్కుతాం. కానీ కొంతమంది వైద్యులు చేస్తున్న పనులతో  పవిత్రమైన వైద్య వృత్తికి కూడా కళంకం ఏర్పడుతోంది. డబ్బు సంపాదనే లక్ష్యంగా.. లాభాలే జీవిత ధ్యేయంగా ఆస్పత్రుల యాజమాన్యాలు వ్యవహరించే తీరు కూడా తీవ్ర విమర్శలకు తావిస్తుంది. ఇలాంటి సంఘటన ఒకటి విశాఖపట్నం నగరంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తలకు తీవ్ర గాయమై చికిత్స కోసం ఓ మహిళ సోమవారం రాత్రి సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చింది. తలకు గాయంతో ఆసుపత్రికి వచ్చిన ఆమెను పరీక్షించిన డాక్టర్లు ఆమెను స్కానింగ్ తీయించుకోవాలని సూచించారు.  


స్కానింగ్ కోసం వెళ్తే.. 
దీంతో సదరు మహిళ ప్రైవేట్ ఆస్పత్రిలో ఉన్న స్కానింగ్ సెంటర్‌కు స్కానింగ్ తీసుకుందామని బాధితురాలు వెళ్లింది. అయితే స్కానింగ్ కోసం వచ్చిన బాధితురాలి పట్ల స్కానింగ్ సెంటర్ ఇన్ ఛార్జీ ప్రకాష్ అసభ్యంగా ప్రవర్తించారు. తలకు గాయమై చికిత్స కోసం ఆస్పత్రికి వస్తే.. స్కానింగ్ కోసం బట్టలు విప్పేయాలని మహిళకు సూచించారు. ఆ తర్వాత ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అతగాడి ప్రవర్తనతో షాక్ అయిన బాధితురాలు వెంటనే గట్టిగా కేకలు వేసింది.  దీంతో వైద్యశాలలోని ఇతర రోగులు స్కానింగ్ సెంటర్ వద్దకు పరుగులు పెట్టారు. దీంతో తన పై వేధింపులకు పాల్పడిన స్కానింగ్ సెంటర్ ఇంఛార్జి తీరు గురించి బాధితురాలు వారితో చెప్పింది. దీంతో ఆస్పత్రికి వచ్చిన వారితో పాటు స్థానికులు స్కానింగ్ సెంటర్ ఇన్ చార్జిని ఉతికి ఆరేశారు.


Also Read : Crime News: పెళ్లంటే కొంత మంది మరణశిక్ష - భార్య వేధింపులతో చనిపోయిన సుభాష్ గురించి తెలిస్తే కన్నీళ్లాగవు !
 
నిందితుడిని శిక్షించాలని డిమాండ్
అనంతరం పోలీసులకు ఈ సమాచారాన్ని అందజేశారు. దీంతో సదరు ప్రైవేట్ ఆస్పత్రి వద్దకు చేరుకున్న విశాఖపట్నం త్రీటౌన్ సీఐ రమణయ్య నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో అతడిపై కేసు నమోదు పెట్టారు. మంగళవారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు పంపించారు.  అదే సమయంలో ప్రైవేట్ ఆసుపత్రి వ్యవహరించిన తీరుపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోగుల విషయంలో ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యంగా ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.  తాజా ఘటనతో ఆసుపత్రి తీరుపై విమర్శలు వస్తున్నాయి. మొత్తానికి వైద్యం చేయించుకుందామని వస్తే ఇలా చేస్తారా అంటూ స్థానికులు మండిపడుతున్నారు. మహిళ పట్ల అసభ్యంగా వ్యవహరించిన స్కానింగ్ సెంటర్ ఇన్ ఛార్జిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.


మహిళలపై పెరుగుతున్న నేరాలు
దేశవ్యాప్తంగా మహిళలపై నేరాలు పెరిగిపోతున్నాయి. 28 శాతం మంది మహిళలు బాధితులే. ప్రతి గంటకు 50 మందిపై దాడులు జరుగుతున్నాయి. గత నాలుగేళ్లలో లైంగిక వేధింపులు, అత్యాచారాలు పెరిగాయి. లైంగిక వేధింపులకు గురై ప్రతిరోజూ 80 మంది మహిళలు న్యాయం కోరుతుండటం బాధాకరం.


 


Also Read : Crime News: అప్పులు చేసి మరి షేర్ మార్కెట్లో పెట్టుబడి, నష్టాలు రావడంతో కుటుంబం ఆత్మహత్యాయత్నం