Atul Subhash suicide has become a sensation in Bengaluru: పెళ్లి చేసుకున్న తర్వాత సర్దుకుపోతే లైఫ్ బాగానే ఉంటుంది. కానీ సర్దుకోలేక కేసుల వరకూ వెళ్తే వ్యవస్థల చేతుల్లో చిక్కితే ఇక నరకమే. బతకడం అవసరమా అనిపిస్తుంది. ఎందుకంటే మన వ్యవస్థలో మహిళలు తప్పు చేయరన్న కోణంలో చట్టాలు ఉంటాయి. వేధించినా మగవాళ్లే .. వేధింపులకు గురయ్యేది మాత్రం ఆడవాళ్లు. ఈ కోణంలో ఓ వైపు భార్య వేధింపులు.. మరో వైపు కేసుల వేధింపులతో ఇక బతకడం వ్యర్థమనుకున్నాడు టెకీ. తన అనుభవాలను సమగ్రంగా ఓ నలభై పేజీల వరకూ సూసైడ్ నోట్ రాసి సుప్రీంకోర్టు, హైకోర్టు, ఇలా ముఖ్యమైన వ్యవస్థలన్నింటికీ మెయిల్ చేసి ప్రాణం తీసుకున్నారు. 


బెంగళూరు నగరం మార్తహళ్లి మంజునాథ్ లేఅవుట్‌లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన అతుల్‌ సుభాష్‌ నివాసం ఉంటున్నాడు. ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నా ఆయన  కొంతకాలంగా భార్యతో అతుల్‌కు పొసగడం లేదు. ఇరువురి మధ్య గొడవలు జరుగుతుండగా.. అతడిపై భార్య ఉత్తర్ ప్రదేశ్‌లో కేసు పెట్టింది.తన భార్యే తనను వేధిస్తోందని ఆయన చెప్పినా ఎవరూ వినిపించుకోలేదు. ఓ వైపు భార్య వేధింపులు మరో వైపు కేసులు.. ఇలా  తీవ్ర మనస్థానికి గురైన సుభాష్..  మానసికంగా కుంగిపోయాడు. చివరకు ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాడు. 


Also Read:  మనోజ్‌ను ఇంట్లో నుంచి గెంటేసిన విష్ణు - రెండు వర్గాల బౌన్సర్ల మధ్య ఘర్షణ - ఆత్మగౌరవ పోరాటమన్న మనోజ్


అయితే తన ప్రాణం కొంత మందికి అయినా కనువిప్పు కావాలనుకున్నాడు. అందుకే సమగ్రంగా లేఖ రాశారు. భార్యతో విబేధాలు తలెత్తిన తర్వాత తాను ఎదుర్కొన్న సమస్యలను సూసైడ్‌ నోట్‌లో సమగ్రంగా వివరించాడg. చివరిగా ‘న్యాయం జరగాలి’ అనే ప్లకార్డును పట్టుకుని.. ఉరేసుకున్నాడు. జీవిత భాగస్వాముల తప్పుడు కేసుల్లో ఇరుక్కునే బాధితులకు సహాయం అందించే ‘సేవ్ ఇండియా ఫ్యామిలీ ఫౌండేషన్’ అనే స్వచ్ఛంద సంస్థలో అతుల్ సుభాష్ సభ్యుడిగా ఉన్నారు. తన సూసైడ్ నోట్‌ను ఆ సంస్థ వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేశారు. వీలుంటే తన కుటుంబానికి మద్దతుగా ఉండాలని గ్రూప్‌లోని సభ్యులను కోరాడు. ఈ ఘటనపై బెంగళూరు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.


Also Read:  ఎవరీ వినయ్ మహేశ్వరి? మోహన్ బాబు వర్సెస్ మనోజ్ గొడవలో కీలకంగా మారిన బయట వ్యక్తి ఎవరు?


అతుల్ సుభాష్ ఎంత పర్ ఫెక్షనిస్ట్ అంటే సుసైడ్ చేసుకోవడానికి ఓ పక్కా ప్లాన్ రెడీ చేసుకున్నాడు.  ‘ఆత్మహత్యకు ముందు స్నానం చేయాలి.. వందసార్లు శివనామస్మరణ చేయాలి. సూసైడ్‌ నోట్‌ను హైకోర్టు, సుప్రీంకోర్టు, ఆఫీసు, కుటుంబ సభ్యులకు మెయిల్‌ చేయాలి. చివరిగా తాడు సిద్ధం చేసుకోవాలి..’ ఇలా ప్రతి ఒక్కటీ రెండు రోజుల ముందే అన్నీ ప్రణాళికాబద్ధంగా రాసిపెట్టుకుని. ఆత్మహత్య చేసుకున్నాడు.  ‘చనిపోవడానికి ఒక రోజు ముందే అన్ని పేమెంట్లు క్లియర్‌ చేయాలి. ఆఫీసు పనిపూర్తి చేయాలి. ల్యాప్‌టాప్‌, చార్జర్‌, ఐడీని ఆఫీసులో అప్పగించాలి’ అని పక్కాగా టైం టేబుల్‌ రాసుకొని ఆచరించాడు.