భూమిని విక్రయించడంలో అడ్డు పడుతున్నాడని ఒక వ్యక్తిని ఎలిమినేట్ చేయడానికి కొందరు వ్యక్తులు ప్రయత్నించారు. కానీ వాళ్లకు పోలీసులు చెక్‌ పెట్టారు. ఆరుగురు సభ్యుల ముఠాలోని నలుగురి హసన్‌పర్తి పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి హత్య చేసేందుకు  వినియోగించిన ఆయుధంతోపాటు బాధితుడికి చెందిన 3 గ్రాముల బంగారు గోలుసును స్వాధీనం చేసుకున్నారు.


పోలీసులు అరెస్టు చేసిన నిందితుల్లో ఒకడు అన్నసాగర్ గ్రామ సర్పంచ్ భర్త బండ జీవన్ రెడ్డి ఉన్నారు. నకిలీ దస్తావేజులతో అన్నాసాగర్ గ్రామ శివారులో ప్రాంతంలో నాలుగు ఎకరాల పొలాన్ని కాజేశాడు. ఈ పోలం ప్రక్కనే అదే గ్రామానికి చెందిన నల్లా శ్యాంసుందర్ (బాధితుడు) అనే వ్యక్తి చెందిన పొలం ఉంది. కాజేసిన నాలుగు ఎకరాలు అమ్మేందుకు యతిస్తున్న టైంలో శ్యాంసుందర్‌ అడ్డుపడుతున్నాడని కక్ష పెంచుకున్నాడ సర్పంచ్ భర్త.  అందుకే కొనేందుకు ఎవరూ రావడం లేదని అనుమానించి చంపేస్తేగాని పొలం అమ్ముడు పోదని భావించారు.


దీంతో శ్యాంసుందర్‌ హత్యకు ప్లాన్ చేశాడు జీవన్ రెడ్డి. దీని కోసం అన్నాసాగర్ గ్రామానికి చెందిన మరో ఇద్దర్ని పురమాయించాడు. వంశీ కృష్ణ, అనిల్‌తో డిస్కషన్ చేశాడు. తన స్నేహితుడు అజర్‌ ఉన్నాడని చెప్పి ఆయనతో ప్లాన్ అమలు చేద్దామని సలహా ఇచ్చాడు వంశీ కృష్ణ. ఇతని ద్వారా శ్యాంసుందర్ రెడ్డి హత్య చేసేందుకు పథకం వేశారు. దీని కోసం ముందుగా అజర్‌కు 40వేల రూపాయలు అందజేశారు.


 డీల్ ఒప్పుకున్న అజర్‌ తన స్నేహితులు అక్బర్, సైలానీ సహాయం తీసుకున్నాడు. డిసెంబర్ 30వ తేదీన శ్యాంసుందర్‌ను చంపేందుకు స్కెచ్ గీశారు. శ్యాంసుందర్ రెడ్డి తన పొలంలోని పనులు ముగించుకొని టూవీలర్‌పై ఇంటికి వస్తున్నప్పుడు అక్బర్, సైలానీ వెంబడించారు. నిర్మానుష్య ప్రదేశంలో బండిని ఆపి శ్యాంసుందర్‌ తలపై కొట్టారు. ఈ దెబ్బకు శ్యాంసుందర్ రెడ్డిని స్పృహ తప్పిపడిపోయారు. అతను చనిపోయి ఉంటాడని అనుకొని నిందితులు మెడలోని బంగారు గొలుసు లాక్కొని పారిపోయారు. 


ంతర్వాత స్థానికుల సాయంతో శ్యాంసుందర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు రిజిస్టర్ చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఏసీపీ శ్రీనివాస్ అధ్వర్యంలో దర్యాప్తు చేపట్టిన హసన్‌పర్తి పోలీసులు నిందితులను గుర్తించారు.


 నల్లగుట్ట వద్ద హసన్‌పర్తి పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా అక్బర్, సైలానీ ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించింది. పోలీసులు  చూసి నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించారు. వెంటనే తేరుకున్న పోలీసులు ఇద్దర్ని పట్టుకొని ప్రశ్నించారు. ఆరా తీస్తే శ్యాంసుందర్ రెడ్డి హత్యకు యత్నించినట్లుగా అంగీకరించారు. నిందితుల ఇచ్చిన సమాచారం మేరకు మిగితా వారిని అరెస్టు చేశారు. నేరాలన్నినిందితులంతా అంగీకరించారు. 


Also Read: రామకృష్ణ కేసులో పురోగతి.. పోలీసుల అదుపులో నలుగురు..? రహస్య ప్రదేశంలో విచారణ!



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి