Action Against Sanath Nagar CI In Woman Incident: ఓ సమస్యపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళతో ఆ పోలీస్ అధికారి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె నెంబర్ తీసుకుని మొబైల్‌కు అసభ్య సందేశాలు పంపించాడు. దీంతో సదరు మహిళ పోలీస్ ఉన్నతాధికారులను ఆశ్రయించగా.. సీఐపై చర్యలు చేపట్టారు. ఓ మహిళ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా.. సనత్ నగర్ ఇన్‌స్పెక్టర్ పురేందర్ రెడ్డి ఆమె నెంబర్ తీసుకుని అసభ్యంగా చాటింగ్ చేశాడు. దీంతో బాధితురాలు సైబరాబాద్ సీపీని ఆశ్రయించారు. సీఐ చాటింగ్ చేసిన వివరాలను సీపీకి చూపించారు. 'అందంగా ఉన్నావ్.. చెప్పిన ప్లేస్‌కు రావాలి' అంటూ సీఐ చేసిన సందేశాల వివరాలను సీపీకి అందించారు. దీంతో సదరు సీఐపై సీపీ చర్యలు తీసుకున్నారు. ఆయన్ను హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. స్టేషన్‌కు వచ్చిన బాధితులతో పోలీస్ అధికారులు, సిబ్బంది మర్యాదగా ప్రవర్తించాలని.. తప్పుగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Also Read: Hyderabad News: కరెంట్ బిల్లు కట్టమన్నందుకు దారుణం - విద్యుత్ సిబ్బందిని చితక్కొట్టిన యువకుడు