Road Accidents In Telugu States: పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఇన్నిరోజుల వరకు వాతావరణం క్లియర్‌గా ఉండటంతో బాగానే ఉన్నా.. గత రెండు రోజుల నుంచి మార్పు కనిపిస్తోంది. దీపావళి సందర్భంగా కాల్చిన బాణసంచా నుంచి కాలుష్యానికి పొగమంచు తోడై రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. 


తెలంగాణలోని కోదాడ సమీపంలో విజయవాడ వెళ్తున్న బస్ ప్రమాదానికి గురైంది. రహదారి 65పై ఆగి ఉన్న ట్రావెల్స్‌ బస్‌ను ఆర్టీసీ బస్‌ ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనోల 30 మందికిపైగా గాయాలు అయ్యాయి. వారిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. 


వెంటనే స్పందించిన బస్‌లోని వారు స్థానికులు.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కోదాడలోని ప్రభుత్వాసుపత్రిలో వారికి చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని వేరే ఆసుపత్రులకు తరలించారు. దారి సరిగా కనిపించకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. విపరీతంగా అలుముకున్న పొగమంచు ఈ ప్రమాదానికి కారణమై


ఉంటుందా అన్న యాంగిల్‌లో కూడా విచారణ చేస్తున్నారు. 
ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఓ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నూలు జిల్లా ధర్మపురంలో ఓ కారు ఆటోను ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో స్పాట్‌లోనే ముగ్గురు మహిళలు మృతి చెందారు. మరో ఇద్దరు కూడా తీవ్రంగా గాయపడి స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.