Rajahmundry News : తూర్పుగోదావరి జిల్లా  రాజమండ్రిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో కలిసి తండ్రి చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాజమండ్రి అర్బన్ రాజవోలు చెరువులో దూకి తండ్రి పక్కి సత్యేంద్ర కుమార్  (40), కుమార్తెలు పక్కి రిషిత (12), పక్కి హాద్దిక (7) తో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  మృతులు రాజమండ్రి అర్బన్ వీఎల్ పురానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.  అకౌంటెంట్ గా పనిచేస్తున్న  సత్యేంద్ర కుమార్ ఉద్యోగంలో ఒత్తిడి వల్ల ఆత్మహత్యకు పాల్పడినట్లు సూసైడ్ నోట్లో రాసినట్లు పోలీసులు తెలిపారు. రెండు రోజుల క్రితం భార్య ఊరు వెళ్లడంతో పిల్లలతో కలిసి సత్యేంద్ర కుమార్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. భార్య తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంటికి తాళం వేసి ఉండడంతో వారికోసం గాలించగా ఎటువంటి సమాచారం తెలియలేదు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.  రాజవోలు చెరువులో మృతదేహాలు లభ్యం కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  


ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర నిర్ణయం  


ఉద్యోగ ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులతో ఓ తండ్రి తన ఇద్దరు చిన్నారులతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజమండ్రి సమీపంలోని రాజవోలులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజమహేంద్రవరం నగరంలోని వీఎల్ పురానికి చెందిన పక్కి సత్యేంద్రకుమార్(40) వివిధ వ్యాపారులకు జీఎస్టీ బిల్స్‌ సంబంధిత లావాదేవీలు చూస్తుండేవారు. సత్యేంద్రకుమార్ కు భార్య స్వాతి, కుమార్తెలు రిషిత(12), హాద్విక(7) ఉన్నారు. భార్య స్వాతి ఆదివారం బంధువుల ఇంట్లో ఓ శుభకార్యానికి వెళ్లారు. సోమవారం తిరిగి ఇంటికి రాగా సత్యేంద్ర కుమార్ తన ఇద్దరు కుమార్తెలు ఇంటి వద్దలేరు. అయితే సతేంద్ర కుమార్ ఇద్దరు చిన్నారులతో తీసుకొని రాజమహేంద్రవరం సమీపంలోని రాజవోలు రోడ్డులోని చేపల చెరువు వద్దకు వెళ్లారు. చెరువులో బాలికలు ఇద్దర్నీ తోసేసి తాను కూడా దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు అతడు రాసిన సూసైడ్ లెటర్ పోలీసులకు దొరికింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అందులో ఉంది.  


లోన్ యాప్ వేధింపులతో దంపతులు సూసైడ్ 


రాజమహేంద్రవరంలో దంపతులు ఆత్మహత్యకు కారణమయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి చెందిన కొల్లి దుర్గాప్రసాద్‌ (32), రమ్యలక్ష్మి (24) దంపతులు రాజమహేంద్రవరంలోని శాంతినగర్‌లో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. దుర్గాప్రసాద్‌ జొమాటో డెలివరీ బాయ్‌ పనిచేస్తున్నారు. అతడి భార్య రమ్యలక్ష్మి మిషన్‌ కుట్టుకుంటూ జీవిస్తున్నారు.  ఇటీవల ఇంటి అవసరాల కోసం ఆన్ లైన్ లోన్ యాప్‌లో కొంత నగదు అప్పుగా తీసుకున్నారు. ఆ అప్పు సకాలంలో తీర్చకపోవడంతో  లోన్‌ యాప్‌కు సంబంధించిన టెలీకాలర్స్‌ ఫోన్ కాల్స్ చేసి వేధింపులు మొదలుపెట్టారు. అప్పు చెల్లించకపోతే భార్యభర్తల నగ్న చిత్రాలు ఆన్ లైన్ లో పెడతామని బెదిరించారు. దుర్గాప్రసాద్‌ బంధువులకు, స్నేహితులకు కాల్స్ చేసి తీసుకున్న విషయాన్ని చెప్పేవారు. ఈ ఘటనలతో పరువు పోయిందని భావించిన దంపతులు మనస్తాపంతో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డారు. 


Also Read : కొముర భీం జిల్లాలో విషాదం, కూల్ డ్రింక్ అనుకొని పురుగుల మందు తాగేసిన ఐదేళ్ల చిన్నారి!


Also Read : Jubilee Hills MLA: టీఆర్ఎస్ ఎమ్మెల్యే PA ఘోరం, పెళ్లైన మహిళ గొంతు కోసి పరార్! అంతకుముందు న్యూడ్ కాల్స్?