Pune: పుణెలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఒకటి స్వర్గేట్ ప్రాంతం. బస్సులు అక్కడ ఎక్కువగా ఆగుతూ ఉంటాయి. ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు అక్కడి వచ్చి బస్సు ఎక్కుతూ ఉంటారు. ఇలా నిలబడి ఉన్న బస్సులో ఓ మహిళ ఒంటరిగా కూర్చుని ఉన్న సమయంలో కండక్టర్ ను అంటూ ఓ వ్యక్తి అందులోకి చొరబడ్డాడు. ఆ బస్సు డ్రైవర్, కండక్టర్ అక్కడ లేరు. కానీ మహిళ ఒంటరిగా ఉందని చెప్పి వ్యక్తి లోపలికి చొరబడ్డాడు. ఒంటరిగా ఉన్న మహిళను రేప్ చేశాడు. బెదిరించి తన కోరిక తీర్చుకుని అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. ఆ మహిళ తనకు జరిగిన ఘోరాన్ని పోలీసులకు చెప్పింది.
ఈ విషయం బయటకు తెలియడంతో పూణె అంతా గగ్గోలు రేగింది. పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ సేకరించారు. బస్సులో అంతా చుట్టూ బిజీగా ఉండగానే.. ఆ దుర్మార్గుడు తన పని తాను చేసుకుపోయాడు. ఈ దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి కూడా.
పోలీసులు నిందితుడు ఎవరో వెంటనే కనిపెట్టారు. అతని పేరు దత్తాత్రేయ, రామ్ దాస్ గడే అనే పాత నేరస్తుడిగా గుర్తించారు. అతని కోసం వేట ప్రారంభించారు. [
ఈ రామ్ దాస్ కరుడు గట్టిన నేరస్తుడని పోలీసులు చెబుతున్నారు. సాంకేతిక త స ాయంతో అతనిని పోలీసులు వెంటాడుతున్నారు. పుణె సమీపంలోని చెరుకు తోటల్లోకి చేరి ..దాకుక్కున్నట్లుగా గుర్తించారు. డ్రోన్ల సాయంతో వెదుకుతున్నారు. నిందిడుతి ఆచూకీ చెబితే రూ. లక్ష రివార్డు కూడా ప్రకటించారు.
ఈ వ్యవహారంపై రాజకీయ దుమారం రేగుతోంది. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నిందితుడ్ని ఇంకా పట్టుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.