Pastor Praveen case update: పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతిపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే ఊరుకునేదిలేదని పోలీసులుప్రకటించారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ఐజీ అశోక్ కుమార్ తాజా సమాచారం ఇచ్చారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల హైదరాబాద్ నుంచి మార్చి 24వ తేదీ ఉదయం 11 గంటలకు బయలుదేరారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి చౌటుప్పల్ టోల్ గేట్ వద్దకు చేరుకున్నారు. ఆ తర్వాత విజయవాడకు చేరుకున్న పాస్టర్ ప్రవీణ్ పగడాల.. విజయవాడలో 3 నుంచి 4 గంటల పాటు ఉనట్లుగా గుర్తించారు. విజయవాడలో పాస్టర్ ప్రవీణ్ పగడాల ఎవరిని కలిశారు? ఏం చేశారు? అనే దానిపై దర్యాప్తు జరుపుతున్నట్లు ఐజీ అశోక్ కుమార్ వివరించారు. కొంతమూరు పెట్రోల్ బంక్ వద్దకు రాత్రి 11 గంటల 40 నిమిషాలకు చేరుకున్నట్లు సీసీ ఫుటేజీ లభించిందన్నారు. ప్రిలిమినరీ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. రేషస్ గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టం లో వెల్లడించారన్నారు. ఇది కేసు అప్ డేట్ మాత్రమే .. ఇంకా ఎలాంటి నిర్ధారణకు రాలేదన్నారు. విజయవాడ సమీపంలోని పొట్టిపాడు నుంచి ..బైక్ బ్లింకర్ వేసుకుంటూ పాస్టర్ ప్రవీణ్ ప్రయాణించారు. పాస్టర్ ప్రవీణ్ కు సంబంధించి 13 సీసీ ఫుటేజ్ లు విడుదల చేశారు. మరో వైపు పాస్టర్ ప్రవీణ్ ది ముమ్మాటికీ హత్యే అని తన వద్ద ఆధారాలు ఉన్నాయని మాజీ ఎంపీ జీ వీ హర్షకుమార్ అంటున్నారు. దీంతో ఇందుకు సంబంధించి హర్షకుమార్ సాక్ష్యాన్ని నమోదు చేసేందుకు పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 29న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5లోపు దర్యాప్తు అధికారికి మీ వద్ద ఉన్న సాక్ష్యాలు అందించాలని నోటీసులో పేర్కొన్నారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, రాజానగరం పోలీస్ట్ స్టేషన్ పేరుతో ఈ నోటీసు జారీ అయ్యింది. ఈ నోటీసులను జీవీ హర్షకుమార్ తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో మంత్రి లోకేష్ బాధ్యత రహితంగా ట్విట్ చేయటం దారుణమని మాజీ ఎంపీ మార్గాని భరత్ విమర్శించారు. పోస్టుమార్టం రిపోర్ట్ బయటకు రాకుండానే యాక్సిడెంట్ అని ఎలా నిర్ధారించారని.. ఇది బాధ్యతారహిత్యం కాదా..అని ప్రశ్నించారు. క్రైస్తవ సంఘాలు ఇది హత్య అని ఘోషిస్తున్నాయి. రాజమండ్రిలో జరిగిన ఫార్మసిస్ట్ అంజలి తన ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు సూసైడ్ నోట్లో వెల్లడించిందన్నారు. బొల్లినేని కిమ్స్ ఎంజిఎం దీపక్ ట్రాక్ రికార్డు కూడా చాలా బ్యాడ్ గా ఉందని.. అమ్మాయిని కొట్టిన ఫోటోలు కూడా త్వరలో విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అమ్మాయి ఏ ఇంజక్షన్ తీసుకుందో ఆ విషయాన్ని తల్లిదండ్రులకు మూడో రోజున తెలిపారని.. తన అవయవాలు దానం చేయాలని, తాను మళ్ళీ పుట్టాలనుకోవడం లేదని సూసైడ్ నోట్ లో బాధితురాలు రాసిందన్నారు.
సూసైడ్ నోట్ దొరికిన తర్వాతే దీపక్ అనే వ్యక్తి కనిపించడంలేదని దీపక్ తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి, అతని మామ రాజమండ్రిలో క్రియాశీలక నాయకుడన్నారు. అధికార పార్టీకి చెందినవారు కనుక ఈ అంశాన్ని తారుమారు చేసే ప్రయత్నం జరుగుతుందని అనిపిస్తుంది . ఈ వ్యవహారంలో రాజకీయాలకు తావులేదు ... బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగాలన్నారు. రాజమండ్రి లో వరుసగా దారుణమైన ఘటనలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి... ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు.