Swati Sachdeva row: తల్లిదండ్రుల శృంగారానికి సంబంధించిన వివాదాస్పద జోక్ వేసి దేశవ్యాప్తంగా అందరితో తిట్టించుకున్న యూట్యూబర్ రణవీర్ అల్లాబడియా నుంచి యూట్యూబర్లు, స్టాండప్ కమెడియన్లు పాఠాలు నేర్చుకోలేదు.ఈ సారి ఓ మహిళా స్టాండప్ కమెడియన్ అంత కంటే ఘోరమైన జోక్ తల్లిపై వేసి విమర్శలు ఎదుర్కొంటున్నారు.
ఓ స్టాంప్ అప్ కామెడీ షోలో కామెడీ చేసిన స్వాతి సచ్‌దేవా తన ఇంట్లో వైబ్రేటర్ దొరికిన తర్వాత తన తల్లి ఎలా స్పందించిందో వివరిస్తూ అందర్నీ నవ్వించే ప్రయత్నం చేశారు. స్వాతి సచ్ దేవ వీడియో క్లిప్ వైరల్ అయింది,
మొదట తన తల్లి వైబ్రేటర్ ను తాను చూశానని.. అప్పటి నుంచి తన ఎదురు పడలేకపోయిందని స్వాతి సచ్ దేవ చెప్పుకున్నారు. అయితే ఇటీవల తన తల్లి తన వైబ్రేటర్ ను చూసిందని.. అప్పుడు ఆమె పూర్తి నమ్మకంతో నా దగ్గరకు వచ్చి నన్ను 'స్నేహితురాలిగా' ఆమెతో మాట్లాడింద్నారు. అంతటితో ఆపలేదు ఆమె ఖచ్చితంగా నా వైబ్రేటర్ కోసం అడుగుతుందని తెలిసిపోయిందన్నారు. 'అది నాన్నది' అని తాను చెప్పానని.. అప్పు తన తల్లి 'అర్ధంలేని మాటలు మాట్లాడకు..అదెందుకో తనకు తెలుసని చెప్పిందన్నారు. ఇది జోకనుకుని అందరూ నవ్వుకున్నారు.
కామెడీ పేరుతో తల్లిదండ్రులను కించ పరుస్తున్నారని పలువురు మండి ప డుతున్నారు.
రణవీర్ అల్లాబదియా ఎలాంటి తప్పు చేశారో స్వాతి సచ్ దేవ కూడా అలాంటి తప్పే చేశారని అంటున్నారు.
స్వాతి సచ్ దేవ స్టాండప్ కమెడియన్ గా మంచిపేరు తెచ్చుకున్నారు. కానీ ఈ జోక్ తో నెగెటివ్ కోణంలో పాపులర్ అయ్యారు.