Vijayawada Crime News : కృష్ణా జిల్లా   పెనమలూరు లో జరిగిన గ్యాంగ్ రేప్ ఘటన నిజమేనని  ఎస్పీ  జాషువా ప్రకటించారు.  బాధితురాలు చిన్న చిన్న పనులు చేసుకుంటూ బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ కింద బాలకోటి అనే వ్యక్తితో సహజీవనం సాగిస్తోందనక్నారు.  శీను అనే పరిచయం ఉన్న నిందితుడితో రెండు రోజులు పాటు పనికి వెళ్ళింది. శ్రీనుతో పాటు నాగరాజు, రవి అనే మరో ఇద్దరూ బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. మూడురోజులపాటు సనత్ నగర్ లోని ఓ ఇంట్లో ఆమెపై అత్యాచారం చేశారు.అనంతరం శీను తీసుకువెళ్లి బాధితురాలుని బాలకోటి కి అప్పగించాడు. అనారోగ్యంగా ఉండడంతో బాలకోటి ఆమెను ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాడని.. హాస్పిటల్ వైద్యుల సమాచారంతో పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని ఎస్పీ తెలిపారు.  ఏడు ప్రత్యేక బృందాలు నిందితులను అరెస్టు చేశామని తెలిపారు.  నిందితుల్లో ఒకడైన రవి కోసం గాలిస్తున్నారు. కూలి పనులు చేసుకుంటూ ఫ్లై ఓవర్ల కింద నివసించే వారి లిస్టు సేకరిస్తున్నామని ఎస్పీ ప్రకటించారు.  


విజయవాడలో నగరంలో ఈ ఘటన వెలుగులోకి రావటం సంచలనంగా మారింది.బాదితురాలు నేరుగా ప్రభుత్వాసుపత్రికి వచ్చి చికిత్స కోసం వైద్యుల ను సంప్రదించిన సమయంలో ఈ దారుణం వెలుగు చూసింది. దీంతో వైద్య సిబ్బంది అందించిన సమాచారం మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. విజయవాడ బెంజిసర్కిల్ సెంటర్ లో దినసరి కూలి పనులు చేసుకునే మహిళను, అక్కడే పనులు చేసే మరో వ్యక్తి పరిచయం అయ్యాడు. పరిచయం ఆదారంగా చేసుకొని పనులు ఇప్పిస్తానని,ఈనెల 17వ తేదీన కానూరులోని సనత్ నగర్ వద్ద గల ఒక గదిలోకి తీసుకువెళ్ళారు.అక్కడ పని ఇప్పిస్తానని నమ్మించి,ఆమె పై బలాత్కారం చేశాడు.అంతటితో ఆగలేదు,అఘాయిత్యానికి ఓడికట్టిన వ్యక్తి మరో ముగ్గురు మిత్రులకు సమాచారం అందించాడు. వారు కూడ ఆమె పై దారుణానికి ఒడికట్టారు. ఇలా మూడు రోజులు పాటు జరిగింది.  
 
అత్యాచారం చేసిన సమయంలో నిందితులు సైకోల్లా ప్రవర్తించారు.  మహిళ ఒంటి పై తీవ్రంగా గాయాలు చేసారు.  సిగరెట్ నిప్పును చేతి కి అంటించటం వంటి దురాగతాలకు పాల్పడ్డారు దీంతో   గంజాయి బ్యాచ్ హస్తం ఉందని పోలీసులు ఓ అంచనాకు వచ్చారు.  నిందితులు బలవంతంగా ఆమెకు కూాడ గంజాయిని తాగించినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికీ బాధితురాలు ఇంకా పూర్తి వివరాలు చెప్పలేని పరిస్థితుల్లోఉంది.  వైద్యులు పూర్తిగా చికిత్స చేసిన తరవాత ఆమె మత్తు నుండి పూర్తిగా బయటకు వచ్చిన తరువాతనే ఈ ఘటన పై అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. అనుమానితుల్ని ఇప్పటికే అరెస్ట్ చేసినందున.. దీని వెనుక ఇంకా ఉన్న వారి కోసం పోలీసులు విచారణ జరిపే అవకాశం ఉంది. 


వరుసగా మూడు రోజుల పాటు నలుగురు వ్యక్తులు మహిళను నిర్బంధించి ఆమె పై దాడికి పాల్పడటంతో పాటుగా,ఆమె కు ఆహరం,తాగేందుకు నీరు కూడ ఇవ్వలేదని బాధితురాలు పోలీసులకు సమాచారం అందించింది. దీంతో జరిగిన ఘటన  అమానుషంగా ఉందని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి . అయితే నిందితుల్ని అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు ప్రకటించడంతో పరిస్థితి సద్దుమణిగింది.