Landmark Cars IPO: ల్యాండ్‌మార్క్ కార్స్ లిమిటెడ్ (LCL) ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్‌కు (IPO) బలమైన ప్రతిస్పందన వచ్చింది. విజయవంతమైన బిడ్డర్స్‌కు IPO షేర్లను మంగళవారం ‍(డిసెంబర్ 20, 2022) ఈ కంపెనీ కేటాయించింది.


గ్రే మార్కెట్‌ ప్రీమియం
లిస్టింగ్‌ డే గెయిన్స్‌ కోసం ఇన్వెస్ట్‌ చేసిన వారిని ల్యాండ్‌మార్క్ కార్స్‌ షేర్లు నిరాశపరిచే సూచనలు కనిపిస్తున్నాయి. గ్రే మార్కెట్‌లో రూ. 5 డిస్కౌంట్‌తో ఒక్కో షేరు చేతులు మారుతోంది. రూపాయి కూడా లాభం లేకుండా షేర్లు లిస్ట్‌ అయ్యే అవకాశం ఉంది.


2022 డిసెంబర్ 13- 15 తేదీల మధ్య జరిగిన రూ. 552 కోట్ల IPOలో, ఒక్కో షేరుకు రూ. 481-506 రేంజ్‌లో కంపెనీ అమ్మింది. ఈ ఇష్యూ, నామమాత్రంగా మూడు రెట్ల కంటే కొంచం ఎక్కువ సబ్‌స్క్రిప్షన్‌ పొందింది. 


అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారుల (QIBలు) కోసం రిజర్వ్ చేసిన కోటా 8.71 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. అయితే నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (NIIలు), ఉద్యోగుల కోసం రిజర్వ్ చేసిన కోటా వరుసగా 1.6 రెట్లు, 2.93 రెట్లు స్పందన అందుకుంది. రిటైల్‌ ఇన్వెస్టర్ల కోసం మరీ ఘోరంగా 59% మాత్రమే సబ్‌స్క్రైబ్ అయింది. అంటే, 100 షేర్లను అమ్మకానికి పెడితే, కేవలం 59 షేర్ల కోసం మాత్రమే ఇన్వెస్టర్లు బిడ్స్‌ వేశారు.


ఈ ఇష్యూలో పాల్గొన్న పెట్టుబడిదారులు, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) వెబ్‌సైట్‌ ద్వారా షేర్ల కేటాయింపు స్థితిని చూసుకోవచ్చు. ఇందుకు ఈ క్రింది స్టెప్స్‌ ఫాలో అవ్వండి:


1) మొదట, https://www.bseindia.com/investors/appli_check.aspx ని సందర్శించండి


2) ఇష్యూ టైప్‌ కింద, ఈక్విటీని క్లిక్ చేయండి


3) ఇష్యూ పేరు కింద, డ్రాప్‌బాక్స్‌లో ల్యాండ్‌మార్క్ కార్స్ లిమిటెడ్‌ని ఎంచుకోండి


4) అప్లికేషన్ నంబర్‌న ఎంటర్‌ చేయండి


5) పాన్ కార్డ్ ID ఎంటర్ చేయండి


6) 'ఐ యామ్‌ నాట్‌ రోబోట్' బాక్స్‌ మీద క్లిక్‌ చేసి, ఆ తర్వాత సబ్మిట్ బటన్‌ నొక్కండి


ఈ ఇష్యూకు రిజిస్ట్రార్ అయిన లింక్ ఇన్‌టైమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆన్‌లైన్ పోర్టల్‌ ద్వారా కూడా మీ షేర్ల కేటాయింపు స్థితిని చూసుకోవచ్చు.


1) లింక్ ఇన్‌టైమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ((https://linkintime.co.in/MIPO/Ipoallotment.html) పోర్టల్‌కి వెళ్లండి


2) డ్రాప్‌బాక్స్‌లో IPOను ఎంచుకోండి. షేర్ల కేటాయింపు పూర్తయితే మాత్రమే ఆ కంపెనీ పేరు కనిపిస్తుంది.


3) ఇప్పుడు, మూడు మోడ్స్‌లో ఒకదానిని ఎంచుకోవలసి ఉంటుంది: అప్లికేషన్ నంబర్, క్లయింట్ ID, PAN ID


4) అప్లికేషన్ టైప్‌లో, ASBA, నాన్ ASBAలో ఒకదానిని ఎంచుకోండి


5) స్టెప్‌ 3లో మీరు ఎంచుకున్న మోడ్‌కు సంబంధించిన వివరాలను ఇక్కడ నమోదు చేయండి


6) భద్రత కారణాల దృష్ట్యా, క్యాప్చాను ఖచ్చితంగా పూరించండి


7) సబ్మిట్‌ బటన్‌ నొక్కండి


IPOలో అలాట్‌మెంట్ పొందని బిడ్డర్స్‌కు 2022 డిసెంబర్ 21 (బుధవారం) నుంచి నగదు వాపసు ప్రారంభమవుతుంది. షేర్లు పొందినవాళ్లకు 2022 డిసెంబర్ 22 (గురువారం) నాటికి డీమ్యాట్ ఖాతాలో షేర్లు క్రెడిట్‌ అవుతాయి. డిసెంబర్ 23 (శుక్రవారం) నాడు ఈ షేర్లు లిస్ట్‌ కావచ్చు.