Vijayawada Crime News :  విజయవాడలో వైఎస్ఆర్‌సీపీకి చెందిన ఓ మహిళా నేత యువతుల్ని ట్రాప్ చేసి వ్యభిచార వృత్తిలోకి దింపుతోందని వచ్చిన వార్తలపై పోలీసులు స్పందించారు. ఈ కేసు విషయంలో ప్రధాన నిందితురాలితో పాటు, మరో వ్యక్తిని అరెస్ట్ చేశామని..  విజయవాడ సెంట్రల్ ఎసీపీ ఖాదర్ భాషా ప్రకటించారు. ప్రధాన నిందితురాలిగా..  ఒక అమ్మాయి ఇన్ స్ట్రాగ్రామ్ లో పరిచయం అయ్యిందని.. ఆ యువతిని తర్వాత పార్టీల పేరుతో హోటల్‌కు పిలిచారన్నారు. ఒక‌ హోటల్ లో అమ్మాయితో ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియో తీసి బెదిరింపులు ప్రారంభించారన్నారు.  యువతితో  ఉన్న వీడియో లతో ఉన్నవి చూపించి డబ్బు డిమాండ్ చేశారుని..  దీని పై‌ విచారణ చేసి ప్రధాన నిందితురాలిని అరెస్టు చేశామని ఖాదర్ భాషా తెలిపారు. 


న్యూడ్ గా ఉన్న వీడియో చూపించి డబ్బులు డిమాండ్ చేసి తీసుకున్నట్లు విచారణ లో తేలిందన్నారు. ఒకే ప్రాంతానికి చెందిన పరిచయస్తులు కలిసి ఈ బ్లాక్ మెయిల్ దందా నడిపారని ఏసీపీ తెలిపారు.  ప్రధాన నిందితురాలికి దుస్తుల దుకాణం ఉందన్నారు.  వీడియోలో   ఉన్న అమ్మాయి ప్రధాన నిందితురాలి వద్ద పని‌ చేయడం లేదని స్పష్టం చేశారు.  ప్రధాన నిందితురాలికి సహకరించిక మరో వ్యక్తి ని కూడా అరెస్టు చేశామని..  మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.. గాలిస్తున్నామని ఏసీపీ ప్రకటించారు.  న్యూడ్ వీడియో చూడి... బయట పెట్టకుండా  ఉండాలంటే.. రెండు లక్షలు డిమాండ్ చేశారని..  బాధితులు  నుంచి లక్షా 90 వేలు ఇచ్చారన్నారు.  ఈ వ్యవహారం లో ఎక్కడా రాజకీయ పరమైన కోణం లేదని ఏసీపీ తెలిపారు. అలాగే ఏ రాజకీయ పార్టీతో కూడా సంబంధం లేదన్నారు.  ఇంకా‌ విచారణ సాగుతుంది... పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. 


టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఓ యువనేత అనచరురాలిగా ఎప్పుడూ హడావుడి చేస్తూ..సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉండే మహిళా నేతపై ఇద్దరు యువతులు నేరుగా సీపీకి ఫిర్యాదు చేసినట్లుగా తెలు్సతోంది.  ఆమె దుకాణానికి వచ్చే యువతుల్ని ట్రాప్ చేసిది. యువనేతతో ఉన్న పరిచయాలను చూపించి.. మాయమటలు చెప్పేదని..  ఆకర్షితులైన వారి ఫోన్ నెంబర్లను తీసుకుని మొదట పార్టీలకు తీసుకెళ్లేదని... మద్యం అలవాటు అయిన తర్వాత మెల్లగా అర్థనగ్న ఫోటోలు తీసి..బ్లాక్ మెయిల్ చేసేదన్న ఆరోపణలు ఉన్నాయి.  ఆ ఫోటోలను యువతులకే పంపి  వ్యభిచారకూపంలోకి దించేదని.. అప్పుడు కూడా వీడియోలు తీసి బ్లాక్ మెయిలింగ్ చేసేదన్న ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు కూడా ఇదే చెబుతున్నారు.  


గతంలో రెండు గ్యాంగులు .. నడిబొడ్డున కత్తులు, కటార్లతో దాడులు చేసుకున్న వ్యవహారం ఇప్పటికీ అందరికీ గుర్తుంది. అందు్లో ఓ గ్యాంగ్ లీడర్ అప్పుడే చనిపోయారు. ఇంకో గ్యాంగ్ లీడర్ బతికే ఉన్నాడు. ఆయనతో కలిసి ఈ మహిళా నేత ఈ వ్యభిచార దందా నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇతన్ని కూడా అరెస్ట్ చేసినట్లుగా పోలీసుల ప్రకటనను బట్టి అర్థముతోంది. నిందితులు ఎవరన్నదాన్ని పోలీసులు ఇంకా బయట పెట్టలేదు. కానీ అరెస్ట్ చేశామని మాత్రం ప్రకటించారు.