Crime News :  అది ప్రశాంతంగా ఉండే గ్రామం. కానీ రెండు రోజులుగా అర్థరాత్రి పూట ఏదో తవ్వుతున్న శబ్దం వస్తోంది. కానీ గ్రామస్తులు పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత కొన్ని ట్రాక్టర్లు అటూ ఇటూ తిరగడం చూశారు.  ఎవరో మట్టి తోలించుకుంటున్నారని లైట్ తీసుకున్నారు. కానీ ఈ తవ్వకాలు.. ట్రాక్టర్ల శబ్దాలు మూడో రోజు పెరిగిపోవడంతో... ఏదో జరుగుతోందన్న అనుమానం వచ్చింది. నాలుగో రోజు పొద్దున్నే ... తవ్వకాలు జరుగుతున్నట్లుగా శబ్దాలు వస్తున్న ఇంటి దగ్గరకు వెళ్లి చూశారు. అక్కడి పరిస్థితులు చూసి ఒక్క సారిగా షాక్‌గురయ్యారు. ఊరు ఊరందర్నీ పిలిపించారు. ఇంతకీ అక్కడేం జరిగిందంటే.. తవ్వకాలే..కానీ గుప్త నిధుల తవ్వకాలు.ఈ కాలంలో కూడా ఇలాంటి పిచ్చి ఉందా అంటే.. వాళ్లకి ఉందని నిరూపించేశారు. 


ఇరవై అడుగుల లోతుగా ఇంట్లో తవ్వకాలు


కృష్ణాజిల్లా నూజివీడు మండలం గొల్లపల్లిలోని ఓ ఇంట్లో గుప్త నిధుల కోసం వారం రోజులుగా తవ్వకాలు చేయ‌టం సంచ‌ల‌నంగా మారింది.ఈ వ్య‌వహ‌రం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గుప్తనిధుల కోసం తవ్వకాలు చేశారు ...ఎకంగా 20 అడుగులు లోతులో ఇంట్లో నే రహస్యంగా తవ్వకాలు జ‌రిగాయి. తవ్వ‌కాలు చేసిన త‌రువాత వ‌చ్చిన మ‌ట్టిని రాత్రి సమ‌యంలో అత్యంత ర‌హ‌స్యంగా త‌ర‌లించారు.  వేదాంతం శ్రీనివాస్ అనే వ్యక్తి  వేదాంతం నమ్మడు కానీ.. మూఢనమ్మకాలు ఎక్కువ నమ్ముతాడు.  తన ఇంట్లో గుర్తు నిధులున్నాయని గట్టి నమ్మకం. ఎందుకంటే ఆయన ఇల్లు చాలా పురాతనమైనది. 


ఎంత తవ్వినా మట్టే వస్తూండటంతో ట్రాక్టర్‌తో తరలింపు


తన పురాతన ఇంట్లో ఖచ్చితంగా గుప్త నిధులు ఉంటాయని భావిస్తూ ఉండేవాడు. ఆ నిధులు వెలికి తీయడానికి గురువుల్ని..బాబాల్నికలిసేవాడు. ఫోటోలు తీసుకొచ్చి గోడలకు తగలించేవాడు. వేదాంతం ఇంట్లో ఎటు చూసిన దేవుళ్ళు, గురువుల ఫోటోలే దర్శనమిస్తాయి.  వంటగది మధ్యలో ఉన్న ఓ గదిలో తవ్వకాలు జరిగాయి. ఎంత తవ్వుతున్నామట్టి వస్తోంది కానీ.. నిధులు కనిపించడం లేదు. చివరికి  ఇంట్లో ఉన్న మ‌రో రెండు గదులను మ‌ట్టితో నింపేశారు.ఇంకా త‌వ్వ‌కాలు పూర్తి కాక‌పోవ‌టంతో రాత్రి వేళ ట్రాక్ట‌ర్ల‌తో మ‌ట్టిని త‌ర‌లిచారు. ఇంట్లో నుండి పెద్ధ పెద్ధ శబ్ధాలు వస్తుండటంతో స్ధానికులు పోలీసులకు సమాచారం అందించారు.


పోలీసులకు సమాచారం ఇచ్చిన గ్రామస్తులు


వేదాంతం శ్రీనివాసరావు సహా ఐదుగురు ని అదుపులోకి తీసుకుని నిందితులను విచారిస్తున్నారు. ఈ వ్య‌వ‌హ‌రం వెనుక ఎవరెవరూ ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అర్ధరాత్రి వేళల్లో కొత్త వ్యక్తులు గ్రామంలో సంచ‌రించ‌టం,వాహ‌నాల్లో రాక‌పోక‌లు సాగించ‌టం తో గ్రామస్తులు 100 నంబ రుకు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఎస్ ఎం లక్ష్మణ్ రంగంలోకి దిగి విదా రణ చేపట్టారు.  ఈ సంఘటనకు సంబంధించి శ్రీనివాసాచార్యు లతో పాటు బెంగుళూరుకు చెందిన‌ ప్రేమనాథ్ సింగ్ , పురుషోత్తమరావు, విశాఖ‌ప‌ట్ట‌ణం కు చెందిన సందీప్  , తణుకు కు చెందిన‌ దుర్గాప్రసాద్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రాత్రి వేళలో ఇంటిలో గజ్జెల చప్పుడు విన్పిస్తుండటంతో ఈ తవ్వకాలు చేసినట్లు శ్రీనివాసాచార్యులు చెప్ప‌టంతో పోలీసులు ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు.