Ambati Vs Janasena :      మంత్రి అంబటి  రాంబాబుపై జనసేన పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఆయనపై రకరకాల పద ప్రయోగాలు చేస్తూ మండి పడుతున్నారు. అంబటి రాంబాబును బపూన్‌ను చేస్తూ.. ఆయన ఫోటోను మార్ఫింగ్ చేసి మరీ ... నాగేంద్రబాబు ఓ ట్వీట్ చేశారు. " బాబూ... ఓ రాంబాబు ఎన్నిస్లారు ఒకే ప్రశ్న అడుగుతావయ్యా అంటూ వ్యాఖ్యానించారు. జంబో సర్కస్ బఫూన్లు అడిగే క్లారిఫికేషన్స్ కి, వైసీపీ సర్కస్ లో నీలాంటి బఫూన్ గాళ్లు అడిగే క్లారిఫికేషన్స్ కు సమాధానం చెప్పే ఓపిక, తీరిక తమ జనసైనికులకు లేదని, తమ ప్రెసిడెంట్ కు అంతకన్నా లేద"ని నాగబాబు స్పష్టం చేశారు. 



అంబటి రాంబాబు వ్యాఖ్యలపై నటుడు, నిర్మాత, పవన్ వీరాభిమాని బండ్ల గణేశ్ స్పందించారు. "అలాగే రంభల రాంబాబు గారు... మా సారు త్వరలో మీకు సమాధానం చెబుతారు" అంటూ బదులిచ్చారు.



జనసైనికులు కూడా అంబటి రాంబాబుపై విరుచుకుపడుతున్నారు. తీవ్రమైన విమర్శలతో కామెంట్లు పెడుతున్నారు. దీనంతటికి కారణం.. మంత్రి అంబటి రాంబాబు చేసిన ఓ ట్వీటే. మంగళగిరి పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న అనంతరం ప్రసంగించిన పవన్ కల్యాణ్ వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. ఓట్లు చీలనివ్వబోమని వైసీపీని గెలవనివ్వబోమని ప్రకటించారు. దీనిపై స్పందించిన అంబటి రాంబాబు  కాటన్ దుస్తుల చాలెంజ్ లు ఆపి, 175 సీట్లకి పోటీచేస్తున్నారా లేదా అనేది స్వాతంత్ర్య దినోత్సవం రోజైనా ప్రకటించండి అంటూ ట్వీట్ చేశారు.  





కాటన్ చాలెంజ్ అంటే  ఇటీవల వపన్ కల్యఆమ్ చేనేత దినోత్సవం రోజున.. కేటీఆర్ ఇచ్చిన చేనేత దుస్తుల కాటన్ చాలెంజ్‌ను స్వీకరించారు. ఆ తర్వాత మరో ముగ్గురికి అదే చాలెంజ్ విసిరారు. అలా విసిరిన వారిలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు. ఆయన ఆ చాలెంజ్‌ను స్వీకరించి చేనేత దుస్తులు ధరించి ఫోటో దిగి పోస్ట్ చేశారు. దీంతో ఆయన జనసేన పార్టీలో చేరుతారన్న ప్రచారం ఊపందుకుంది. అయితే తర్వాత ఆ ప్రచారాన్ని బాలినేని ఖండించారు. 


అయితే సమయం సందర్భం లేకుండా జనసేన రాజకీయ వ్యూహాలపై ఎన్ని సార్లు చెప్పినా ఒకే రకమైన వమర్శలు చేస్తూండటంతో జనసేన వర్గాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. సోషల్ మీడియాలో అంబటి రాంబాబుపై విరుచుకుపడుతున్నారు.