Nagpurs Women extorting lakhs of rupees:  పెళ్లి పేరుతో మగవాళ్లను మోసం చేసే  ఘటనలు పెరిగిపోతున్నాయి.  నాగ్‌పూర్‌లోని గిట్టీఖదాన్ పోలీసులు 35 సంవత్సరాల సమీరా ఫాతిమా అనే మహిళ  గత 15 సంవత్సరాలలో 8 మంది సంపన్న వివాహిత పురుషులను వివాహం చేసుకుని, వారి నుండి లక్షల రూపాయలు వసూలు చేసింది. ఇప్పుడు తొమ్మిదో పెళ్లికి  రెడీ కావడంతో పోలీసులు అరెస్టు చేశారు. 

సమీరా ఫాతిమా, సంపన్న వివాహిత ముస్లిం పురుషులను లక్ష్యంగా చేసుకుంది. ఆమె మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లు,  ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా  సంపన్నలకు వల వేసేది.  ఆమె తనను తాను వితంతువు లేదా విడాకులు పొందిన మహిళగా పరిచయం చేసుకునేది.  భావోద్వేగ కథలతో బాధితుల సానుభూతిని పొందేది. తర్వాత పెళ్లికి అంగీకరించేది. రిజిస్టర్డ్ వివాహం చేసుకున్న తర్వాత, ఆమె తన భర్తలను మానసికంగా వేధించడం ప్రారంభించేది. సంభాషణలను రహస్యంగా రికార్డు చేసి, ఎడిట్ చేసిన ఆడియో క్లిప్‌లను ఉపయోగించి గందరగోళం సృష్టించేది. బెదిరింపులు ,ఫేక్ లీగల్ కేసులతో లక్షల రూపాయలు వసూలు చేసేది.

ఒక బాధితుడి నుండి 50 లక్షల రూపాయలు, మరొకరి నుండి 15 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు  ఆరోపణలు ఉన్నాయి. ఒక బాధితుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్ అధికారి కాగా, మరొక బాధితుడు 2022లో ఆమెను వివాహం చేసుకున్న ఘులామ్ పఠాన్, ఆమె తన నుండి 10 లక్షల రూపాయల చెక్ తీసుకుని, తప్పుడు ఫిర్యాదులు చేసిందని ఆరోపించాడు.  సమీరా ఫాతిమా  9వ పెళ్లి చేసుకునేందుకు  ప్లాన్ చేశారు. తాను పరిచయం పెంచుకున్న వ్యక్తితో మాట్లాడేందుకు  నాగ్‌పూర్‌లోని సివిల్ లైన్స్‌లో ఉన్న ‘డాలీ కీ టప్రీ’ అనే టీ స్టాల్ వద్దకు వచ్చినప్పుడు, గిట్టీఖదాన్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.                 

 2023 మార్చిలో ఘులామ్ గౌస్ పఠాన్ అనే ట్రావెల్ వ్యాపారి గిట్టీఖదాన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు, ఆమె 2010 నుండి దాదాపు 50 లక్షల రూపాయలు మోసం చేసినట్లు పేర్కొన్నాడు. దర్యాప్తు అధికారి శారదా భోపలే నేతృత్వంలో పోలీసులు ఒక చాకచక్యంగా ప్రణాళిక వేసి, సమీరాను అరెస్ట్ చేశారు. ఆమె అరెస్ట్‌ను నివారించడానికి గర్భవతిగా ఉన్నట్లు తప్పుడు వాదన చేసినప్పటికీ, పోలీసులు ఆమెను పట్టుకున్నారు.ఆమె వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలిగా పనిచేసినట్లు తెలుస్తోంది, అయితే ఆమె ఒక గ్యాంగ్‌తో కలిసి ఈ మోసాలను నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు.                      సమీరా ఒంటరిగా పనిచేయలేదు, ఆమె ఒక గ్యాంగ్‌తో కలిసి పనిచేసింది. ఈ గ్యాంగ్ బాధితుల నుండి డబ్బు వసూలు చేయడంలో ఆమెకు సహాయం చేసింది మహారాష్ట్ర పోలీసులు ఆమె సహచరులను గుర్తించేందుకు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో మగవాళ్లను ఇలా వరుసగా పెళ్లిళ్ల పేరుతో మోసం చేస్తున్న వారు పెరిగిపోతున్నారు.