Revanth aimed at making Rahul the Prime Ministe: రాహుల్ గాంధీ గారిని భారత ప్రధాని చేయాలన్న లక్ష్యంతో, ఈ దేశాన్ని సామాజిక న్యాయ మార్గంలో నడిపించాలన్న సంకల్పంతో, మేమంతా సిద్ధంగా ఉన్నామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన Annual Legal Convlave లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
గెలిచినా ఓడినా ప్రజల కోసం పోరాడే పార్టీ కాంగ్రెస్
దేశ స్వాతంత్ర్యం కోసం ప్రారంభమైన పార్టీ కాంగ్రెస్… ఈరోజు ఈ దేశంలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఇతర అన్ని రాజకీయ పార్టీలు దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాతే ప్రారంభమయ్యాయన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి ప్రారంభమైన పార్టీ. ఈ దేశానికి స్వాతంత్ర్యం అందించిన పార్టీ కాంగ్రెస్. ఇతర రాజకీయ పార్టీలలా కాదు. ఇతర రాజకీయ పార్టీలు ఎన్నికలొస్తే పోటీ చేయడం, గెలిస్తే పదవిలో కూర్చోవడం, ఓడిపోతే ఇంట్లో కూర్చోవడం అలవాటైపోయిందన్నారు. బీజేపీ నుంచి మొదలుకొని చాలా విపక్ష పార్టీలు ఇలాగే వ్యవహరిస్తున్నాయి. ఓడిపోయాక ప్రజల మధ్యకు రావడం లేదు…. గెలిచినప్పుడే కనిపిస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం నిత్యం ప్రజల మధ్య ఉండి, ప్రజల కోసం పని చేసే రాజకీయ పార్టీగా నిలుస్తోందన్నారు.
రిజర్వేషన్లు రద్దు చేయాలని మోదీ ప్రయత్నం
ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లు రద్దు చేయాలనే ప్రయత్నం చేస్తోంది. గత 11 ఏళ్లుగా సామాజిక న్యాయం గురించి కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం ఆలోచించలేదన్నారు. కొందరు బీజేపీ నాయకులు తరచూ మాట్లాడుతుంటారు. "కాంగ్రెస్ పార్టీ చేసిందేమిటి?" నేను ఈ బీజేపీ నాయకులకు గుర్తు చేయాలనుకుంటున్నా… కాంగ్రెస్ పార్టీ పోరాటం ద్వారానే 41 కోట్ల భారతీయుల స్వాతంత్ర్యం సిద్ధించిందన్నారు. దేశం ఒకప్పుడు ఉగ్రవాద ప్రమాదాల్లో చిక్కినప్పుడు, పక్కనున్న పాకిస్తాన్ నుండి ముప్పు వచ్చినప్పుడు, ఇందిరా గాంధీ ధైర్యంగా యుద్ధాన్ని ప్రకటించారన్నారు. పాకిస్తాన్‌ను ఓడించి, ఆ దేశాన్ని రెండు భాగాలుగా విడదీసి, ఆ యుద్ధాన్ని జయించి, కాళీమాత గౌరవాన్ని నిలబెట్టారు. మూడోసారి ఉగ్రవాదుల చేతిలో దేశం ప్రమాదంలో ఉన్నప్పుడు, రాజీవ్ గాంధీ గారు తన ప్రాణాలను త్యాగం చేసి, దేశాన్ని రక్షించారన్నారు. అయినా కూడా “గాంధీ కుటుంబం దేశం కోసం ఏం చేసింది?” అన్న ప్రశ్నను ఎప్పుడూ లేపుతూనే ఉంటారని విమర్శించారు. ఈ దేశం కోసం మహాత్మా గాంధీ గారు, ఇందిరా గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు ప్రాణత్యాగం చేశారు.
ప్రధాని పదవిని త్యాగం చేసిన సోనియా ప్రధాని పదవిని త్యాగం చేసి ఆర్థిక నిపుణుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని భారత ప్రధాని చేయడం ద్వారా ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా భారత్ ఎదగడంలో సహకారాన్ని సోనియా అందించారన్నారు. తర్వాత రాష్ట్రపతి పదవిని చేపట్టే అవకాశం వచ్చినప్పటికీ సోనియా గాంధీ గారు దాన్నీ తిరస్కరించారు. , రాహుల్ గాంధీ గారి గురించి బీజేపీ నాయకులు ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఆయన చేసిన త్యాగం వాళ్లకు అర్థం కాదన్నారు. రాహుల్ గాంధీ కావాలనుకుంటే 2009 లోనే కేంద్ర మంత్రి అయి ఉండేవారు. ప్రధాని కూడా అయి ఉండేవారు. కానీ వారు ఆ పదవులకు దూరంగా ఉన్నారన్నారు. ఆ అవకాశాన్ని పార్టీ పెద్దలకి ఇచ్చి, తాను మాత్రం కేవలం ఒక కార్యకర్తగా ప్రజల కోసం పనిచేస్తున్నారు.
పదవిని వదలడానికి సిద్ధంగా లేని మోదీ
నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈ రోజు వరకూ, బీజేపీ నేతలు, ఆర్ఎస్ఎస్ కుటుంబం కూడా పదవి నుంచి మోదీ ని తప్పించడానికి ప్రయత్నాలు జరిగాయి. కానీ మోదీ గారు పదవిని వదలడానికి ఏ సందర్భంలోనూ సిద్ధంగా లేరన్నారు. రెండు నెలల క్రితం నేను మోహన్ భగవత్ ..75 ఏళ్లు దాటిన వారు రిటైర్ కావాలన్నారు. మోదీ మాత్రం తన పదవిని వదిలి కొత్తవారికి అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా లేరన్నారు. మోదీ ని గద్దె దించడమే రాహుల్ గాంధీ లక్ష్యం. ఇది రాబోయే ఎన్నికల్లో జరగబోతోందన్నారు. సంఘ్ కుటుంబం చేయలేకపోయిన పనిని, అటల్ బిహారీ వాజ్‌పేయి చేయలేకపోయిన పనిని, రాహుల్ గాంధీ చేసి చూపిస్తారన్నారు రాహుల్ గాంధీ నేతృత్వంలో రాబోయే ఎన్నికల్లో బీజేపీకి 150 సీట్లు దాటకుండా తగిన గుణపాఠం చెప్పే బాధ్యతను మేము తీసుకుంటామని ప్రకటించారు.