Fire Works Burst In Amalapuram: అంబేడ్కర్ కోనసీమ జిల్లా (Konaseema District) అమలాపురం రావులచెరువు ప్రాంతంలో సోమవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో ఈ ఘటన జరగ్గా.. పేలుడు ధాటికి రెండంతస్తుల భవనం నేలమట్టం అయ్యింది. ఈ ప్రమాదంలో 14 మందికి గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Amalapuram: కలెక్టరేట్ సమీపంలో భారీ పేలుడు - రెండంతస్తుల భవనం ధ్వంసం, భయాందోళనకు గురైన ప్రజలు



ఈ పేలుడుకు కారణం ముందు గ్యాస్‌ సిలెండర్‌ అని అనుకున్నా నిల్వ ఉంచిన బాణాసంచా సామగ్రి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఇంకా శిథిలాల కింద ఎవరైనా ఉన్నారా అని పరిశీలన చేస్తున్నారు. భవనంలో 150 కిలోల వరకూ బాణాసంచా తయారీకి ఉపయోగించే మందుగుండు రా మెటీరియల్ ఉందని సమాచారం. పేలుడు ధాటికి సమీపంలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో తెలియని పరిస్థితుల్లో పరుగులు పెట్టారు.


Also Read: Cyber Crime: సైబర్ నేరగాళ్లు కుచ్చుటోపీ పెట్టారు - సాఫ్ట్ వేర్ ఉద్యోగిని బెదిరించి లోన్ తీసుకున్నారు, ఎక్కడంటే?