చిత్ర పరిశ్రమలో మాత్రమే కాదు... ఏ రంగంలోని మహిళలైనా సరే వేధింపులకు గురైతే, ఆ విషయం తన దృష్టికి వస్తే సోషల్ మీడియా వేదికగా ప్రజలు అందరికీ తెలిసేలా చేసే ధైర్యవంతురాలు గాయని చిన్మయి శ్రీపాద. తమిళ చిత్రసీమలో అనేక పాటలు రాసిన వైరముత్తు ఒకానొక సందర్భంలో తనమీద లైంగిక వేధింపులకు పాల్పడ్డారని చిన్మయి చెప్పిన సంగతి తెలిసింది. ఇప్పుడు మరోసారి వైరముత్తు మీద ఆవిడ వ్యాఖ్యలు చేశారు. లైంగిక వేధింపులకు పాల్పడే అటువంటి వారిపై రోమిని కమిటీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని అర్థం వచ్చేలాగా ఆవిడ వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల్లోకి వెళితే...
హేమ కమిటీని స్వాగతించిన వైరముత్తు
మలయాళ చిత్ర పరిశ్రమలో చీకటి కోణాలను వెలికి తీసిన హేమ కమిటీని లిరిసిస్ట్ వైరముత్తు స్వాగతించారు. అటువంటి కమిటీ ప్రతి చిత్రశ్రమలోనూ రావాలని ఆయన మీడియాతో చెప్పారు. దాంతో ఆయనను తమిళ హార్వే వెయిన్ స్టీన్ కింద చిన్మయి పేర్కొన్నారు. హాలీవుడ్ చిత్రసీమను ఓ కుదుపు కుదిపేసిన మీ టూ మూమెంట్ రావడానికి కారణం హార్వే. తమను లైంగికంగా వేధించారని అతడిపై పలువురు హాలీవుడ్ కథానాయికలు తెలిపారు. అదే విధంగా వైరముత్తుకు వ్యతిరేకంగా 20 మందికి పైగా మహిళలు తమ గళం వినిపించాలని చిన్మయి తెలిపారు.
రోహిణి కమిటీ ఏమి చేయలేదా?
వైరముత్తు మీద ఆరోపణలు చేసిన తర్వాత తనపై తమిళ చిత్రసీమ బ్యాన్ విధించిందని చిన్మయి తెలిపారు. ఒకని ఒక సమయంలో రాజీ కుదుర్చుకోవాల్సిందిగా వైరముత్తు రాయబారాలు నడిపినట్టు కూడా వివరించారు. తమిళ చిత్ర పరిశ్రమలో కొంతమంది మంచి వ్యక్తులు ఉన్నప్పటికీ వాళ్ళు మాట్లాడలేరని మిగతా వారంతా ఒక తాటిపైకి వచ్చారని చిన్మయి పేర్కొన్నారు.
Also Read: జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపులు, రేప్ కేసు - 21 ఏళ్ల అమ్మాయి కేసు పెట్టడంతో...
హేమ కమిటీ తరహాలో ఇటీవల తమిళ చిత్ర పరిశ్రమలో నటి రోహిణి ఆధ్వర్యంలో ఓ కమిటీ ఏర్పాటు అయింది. ఇటువంటి ఫిర్యాదులను ఆ కమిటీ తీసుకోదా? అని చిన్మయిని ఒకరు ప్రశ్నించగా... ''వారు నా ఫిర్యాదును తీసుకోలేరు. నటీనటుల కోసం ఆ సంఘంలోని సభ్యులకు కోసం ఏర్పాటు చేసిన కమిటీ అది. అది లీగల్ కమిటీ కాదు. లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తితో పనిచేయాలని నిర్మాత అనుకుంటే అప్పుడు ఎవరు ఏమి చేయలేరు. ఆ నిర్మాతను ఎవరు ఆపలేరు'' అని చిన్మయి కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేశారు.
Also Read: హాలీవుడ్ రేంజ్‌లో 'దేవర'... ఒక్క ఫైట్‌కు 10 నైట్స్ - సైఫ్ మాటలు వింటే గూస్ బంప్స్ గ్యారంటీ