Parvathipuram News : ఏపీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తొమ్మిదేళ్ల బాలికపై ఓ మృగాడు లైంగికదాడికి పాల్పడ్డాడు. పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలంలోని ఓ గ్రామంలో ఈ దారుణం జరిగింది. డీఎస్పీ జీవీ కృష్ణారావు తెలిపిన వివరాలు మేరకు... ఆదివారం రాత్రి వీరఘట్టం మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక బహిర్భూమికి వెళ్లేందుకు బయటకు వచ్చింది. అదే గ్రామానికి చెందిన గౌరునాయుడు (48) అనే వ్యక్తి బాలిక రాకను గమనించి మాటు వేశాడు. చిన్నారిని బలవంతంగా పట్టుకుని దూరంగా ఉన్న స్మశానంలోకి తీసుకెళ్లారు. చిన్నారి అరవకుండా బలవంతంగా నోరు మూశాడు. ఆ తర్వాత చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో అటువైపు స్థానికులు రావడంతో అతడు అక్కడి నుంచి పారిపోయాడు. చిన్నారిని గమనించి స్థానికులు అక్కడి చేరుకుని ఆమె ఆరా తీయగా జరిగిన ఘటన చెప్పింది. అప్పటికే నిందితుడి అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడి కోసం గాలించిన స్థానికులు... అతడ్ని పక్క గ్రామంలో పట్టుకున్నాడు. అనంతరం దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాలికను పాలకొండ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. నిందితుడి గౌరు నాయుడు మీద పోక్సో కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
దెయ్యాన్ని వదిలిస్తానని నమ్మించి అత్యాచారం
ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. ఉత్తరప్రదేశ్ లోని కౌశాంబి జిల్లాలో 45 ఏళ్ల అశోక్ కుమార్ దెయ్యాన్ని వదిలిస్తాననే సాకుతో బాలికపై దారుణానికి పాల్పడ్డాడు. ఆ బాలిక మూడేళ్లుగా మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆమెకు నయం కాకపోవడంతో...అశోక్ అనే వ్యక్తి బాలికకు దెయ్య పట్టిందని బాలిక కుటుంబాన్ని నమ్మించాడు. దెయ్యం వదిలించడం తనకు తెలుసని నమ్మంచి కొన్ని రోజులు బాలిక ఇంటికి వచ్చివెళ్తుండేవాడు. ఈ క్రమంలో బాలిక ఇంటికి వచ్చిన అశోక్ ... దెయ్యాన్ని వదిలిస్తాను బాలికను తనతో పంపించాల్సిందిగా తల్లిని ఒప్పించాడు. ఆ తర్వాత బాలికను ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంటికి తిరిగొచ్చిన బాలిక తన తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రులు అశోక్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
ప్రియురాలిపై స్నేహితులతో కలిసి అత్యాచారం
తమిళనాడులో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళపై ఆమె ప్రియుడు, స్నేహితులు అత్యాచారానికి పాల్పడ్డాడు. తమిళనాడు తిరువళ్లూరు సమీపంలోని ఇద్దరు చిన్నారులతో తల్లి నివాసం ఉంటుంది. ఆమెపై ప్రియుడు, తన ఇద్దరు స్నేహితులు కలిసి ఆదివారం అత్యాచారం చేశారు. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వివాహిత ప్రియుడు విజయకుమార్, ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. వయసులో తన కంటే ఆరేళ్ల చిన్నవాడైన విజయకుమార్ తో మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుంది. విజయ్‌కుమార్‌తో ఆమె ఆరు నెలలుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. తన భర్తతో గొడవల కారణంగా విడిపోవాలనే ఆలోచనలో ఆమె ఉందని పోలీసులు తెలిపారు. చీర కొనిస్తానని ఆమెను నమ్మించిన విజయకుమార్ ప్రియురాలిని తన ఇంటికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో తన స్నేహితులను పిలిచి ఆమెపై అత్యాచారం చేశాడు విజయకుమార్. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.