Palnadu Crime : పల్నాడు జిల్లాలో యువకుడి కిడ్నాప్, హత్య కేసు సంచలనమైంది. అందరూ చూస్తుండగానే యువకుడ్ని కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత రోజే అతడు శవంగా తేలాడు. నరసరావుపేటలో కళ్యాణ్ జ్యూయలరీ ఎగ్జిక్యూటివ్ రామాంజనేయులు కిడ్నాప్, హత్యకేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులు జంగం బాజి, జంగం రామయ్య అని పోలీసులు తెలిపారు. తన సోదరుడు చంటి కిడ్నాప్ లో రామాంజనేయులు పాత్ర ఉందని భావించి కిడ్నాప్ చేసి అతడ్ని హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. తమ సోదరుడు చంటి ఆచూకీ తెలపమని ముందుగా రామాంజనేయులపై దాడి చేశారని, ఆ తర్వాత చంటి చనిపోయాడని చెప్పడంతో ఆ హత్యలో భాగస్వామివే అంటూ రామాంజనేయులను చంటి సోదరులు హత్య చేశారన్నారు.
రాజకీయాలతో సంబంధంలేదు
రామాంజనేయులు హత్య వ్యక్తిగత కారణాలతో జరిగిందిని తెలిపిన డీఎస్పీ విజయభాస్కరరావు తెలిపారు. ఈ హత్యకు ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవన్నారు. రాజకీయాలు పులిమి కొన్ని రాజకీయ పార్టీలు రాస్తారోకో చేసి శనివారం రెండు గంటల పాటు ప్రజలను ఇబ్బంది పెట్టారన్నారు. వారిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తామన్నారు.
వ్యక్తిగత కక్షతోనే హత్య
"జొన్నలగడ్డకి చెందిన రామాంజనేయులు నరసరావుపేటలో జ్యూయలరీ షాపులో పనిచేస్తున్నాడు. ఇతడికి జంగం చంటి మంచి స్నేహితుడు. అయితే జంగం చంటి గత ఏడాది సెప్టెంబర్ లో కనిపించకుండా పోయాడు. దీంతో నాదెండ్ల పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు అయింది. చంటి కనిపించనప్పటి నుంచి అతడి సోదరులు బాజి, రామయ్య రామాంజనేయులను పలుమార్లు తమ సోదరుడి గురించి అడిగారు. ఈ జంగం చంటికి పలు కేసుల్లో రామాంజనేయులు బాయిల్ పెట్టి తెచ్చేందుకు సాయపడ్డాడు. దీంతో చంటి ఎక్కడున్నాడో రామాంజనేయులకు తెలుసని ప్రశ్నించేవారు. దీంతో 22వ తేదీన చంటి సోదరులు రామాంజనేయులకు ఫోన్ చేసి మాట్లాడాలన్నాడు. కానీ ఇతడు షాపులో బిజీగా ఉండి రాలేనని చెప్పాడు. దీంతో వాళ్లు షాపు వద్దకు వచ్చి రామాంజనేయులను బలవంతంగా తీసుకెళ్లి ఆటోలో నరసరావుపేటలో చాలా సేపు తిప్పారు. ఆ తర్వాత ఎడ్లపాటు కాలువ వద్దకు తీసుకెళ్లి చంటి వివరాలు అడిగారు. చంటిని వేరేవాళ్లు చంపేశారని చెప్పడంతో కోపంలో రామాంజనేయులను హత్య చేశారు." అని డీఎస్పీ విజయభాస్కరరావు తెలిపారు.
Also Read : Palnadu District: అందరూ చూస్తుండగా పట్టపగలే కిడ్నాప్, మరుసటిరోజు ఉదయం శవమై కనిపించిన ఎగ్జిక్యూటివ్ !