Palnadu Knife Attack : పల్నాడు జిల్లా దారుణ సంఘటన జరిగింది. సత్తెనపల్లి మండలం వెన్నేదేవి గ్రామంలో కూతురిపై బాబాయ్ కత్తితో దాడి చేశాడు. ఆస్తి గోడవల కారణంగా రోడ్డుపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన కోటమ్మ (45) పరిస్థితి విషమం ఉంది. ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. 30 సెంట్ల స్థలం కోసం వివాదంమొదలైనట్లు తెలుస్తోంది.
ఆస్తి వివాదం!
పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి మండలం వెన్నేదేవి గ్రామంలో దారుణం జరిగింది. కూతురిపై కత్తితో బాబాయ్ కోటయ్య దాడికి పాల్పడ్డాడు. 30 సెంట్ల స్థల వివాదంతో రోడ్డుపై దాడి చేశాడు. బాధితురాలు కోటమ్మ (45)ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. గ్రామస్థుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దాడికి సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై కేసు ననమోదు చేసి విచారణ చేస్తు్న్నారు.
నడిరోడ్డుపై దారుణ హత్య
కర్ణాటకలోని దావణగెరె జిల్లాలోని చన్నగిరి తాలుకాలో దారుణ ఘటన జరిగింది. పట్టపగలే జకీర్ అనే వ్యక్తిని కత్తితో పొడిచి హత్య చేశాడు సలీం అనే వ్యక్తి. స్థానికులు సలీం నుంచి జకీర్ ను కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. తీవ్రగాయాలపాలైన జకీర్ అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడు నల్లూరు చెందినవాడని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో కారులో ఉన్న వ్యక్తి వీడియో తీశాడు. ఈ వీడియో వైరల్ అయ్యింది.
ఎస్ఐపై కత్తితో దాడి
ఏదైనా గొడవ జరిగినా, అనుకోని అపాయం ఎదురైనా వెంటనే మనం పోలీసులకు కాల్ చేస్తుంటారు. అలాంటిది ఓ వ్యక్తి కారణంగా పట్టపగలే ఓ పోలీసుకు ప్రాణాల మీదకి వచ్చింది. కానీ ధైర్యంగా పరిస్థితిని ఎదుర్కోని రియల్ హీరోగా నిలిచారు కేరళ పోలీస్. ఈ ఘటనపై తెలంగాణ అడిషనల్ డీజీపీ, మహిళా ఐపీఎస్ స్వాతి లక్రా స్పందించారు. రియల్ హీరో అంటూ కేరళ ఎస్‌ఐని కొనియాడారు. ఆమె షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీస్ సమయస్ఫూర్తి, ధైర్య సాహసాలను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
ఏం జరిగిందంటే?
కేరళలోని నూరనాడు పోలీస్ స్టేషన్‌కు చెందిన వాహనం జూన్ 12న సాయంత్రం పెట్రోలింగ్ విధులు నిర్వర్తిస్తోంది. ఎడప్పోన్, కాయంకులంకు వెళ్లే జంక్షన్ వద్దకు వచ్చిన పోలీసులు స్కూటీపై అనుమానంగా ఓ వ్యక్తి కనిపించడంతో ఆగారు. పోలీస్ వాహనం ఆపిన వెంటనే ఎస్‌ఐ కిందకి దిగాడు. ఎస్ఐ కోసమే ఎదురుచూస్తున్నట్లుగా బ్లూ షర్ట్ ధరించిన నిందితుడు పెద్ద కత్తితో దాడికి పాల్పడ్డాడు. అనుకోని సంఘటనతో ఒక్కసారిగా పోలీస్ షాకయ్యాడు. అంతలోనే తేరుకున్న ఎస్‌ఐ నిందితుడ్ని ప్రతిఘటించాడు. ఒకట్రెండు కత్తి వేట్లు చేతిపై పడినా ఆయన ఎక్కడా తగ్గలేదు. సుగ్ధన్ అనే వ్యక్తిని పట్టుకున్న ఆ పోలీస్ ఒడిసిపట్టుకొని కిందపడేశాడు. అతడి చేతిలోకి కత్తిని లాక్కుని, నిందితుడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.