Palnadu Crime News: పాత పగలు మనసులో పెట్టుకున్న ఓ తండ్రి, తన పదహారేళ్ల కుమారుడి సాయంతో ఓ వ్యక్తిని హత్య చేశారు. ముందుగా రాడ్డుతో తలపై కొట్టి చంపేశారు. ఆపై మృతదేహాన్ని సంచిలో తీసుకొని తమ పంట పొంల వద్దకు వెళ్లారు. అక్కడే మృతదేహాన్ని 16 ముక్కలుగా నరికారు. ఆపై కట్టెలన్నీ ఓ చోట చేర్చి... ఆ ముక్కలను అందులో వేసి నిప్పంటించారు. మంట బాగా అంటుకున్నాక తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. హత్య చేసినప్పుడు వాళ్లు వేసుకున్న బట్టలను విడిచి ఇవ్వగా భార్యగా కాల్చి వేసే ప్రయత్నం చేసింది. కానీ ఇంతలోపే అక్కడకు పోలీసులు వచ్చారు. నిందితులను అరెస్ట్ చేశారు.
అసలేం జరిగిందంటే..?
పల్నాడు జిల్లా గురజాయ నియోజకవర్గం దాచేపల్లికి చెందిన 45 ఏళ్ల కోటేశ్వర రావు, బొంబోతుల సైదులు నగర పంచాయతీలో పొరుగు సేవల కింద ప్లంబర్లుగా పిన చేస్తున్నారు. విధుల్లో భాగంగా శుక్రవారం రాత్రి 8 గంటలకు విద్యుత్తు మోటారను ఆపడానికి బైపాస్ ప్రాంతంలోని వాటర్ ట్యాంక్ వద్దకు కోటేశ్వర రావు వెళ్లారు. అప్పటికే అక్కడ కాపుకాచిన సైదులు, అతడి 16 ఏళ్ల కుమారుడు కలిసి ఇనుప రాడ్లతో కోటేశ్వర రావు తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మరణించారు. అనంతరం మృతదేహాన్ని సంచిలో వేసుకొని తమ పంట పొలం వద్దకు తీసుకు వెళ్లారు. మిర్చి పంటలో మృతదేహాన్ని ఉంచి గొడ్డలితో పైశాచికంగా నరికారు. మృతదేహాన్ని 16 ముక్కలు చేసి.. వాటిపై కర్రలు పేర్చారు. పెట్రోల్ పోసి నిప్పంటించారు. మంట బాగా అంటుకున్నాక ఇంటికి వెళ్లిపోయారు.
అయితే రాత్రి పది దాటినా కోటేశ్వర రావు ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు, బంధువులు ఆరా తీశారు. తలోదారి వెళ్లి వెతకడం ప్రారంభించారు. అదే క్రమంలో ఎదురైన తండ్రీకుమారులను అడగ్గా.. తమకు తెలియదంటూ ఆతృతగా వారు వెళ్లిపోయారు. బంధువులు అనుమానంతో ఆ ప్రాంతమంతా కలియదిరిగారు. పొలాల్లో మంటలను చూసి అక్కడకు వెళ్లి క్షణ్ణంగా పరిశీలించారు. అయితే కాలిపోతున్న ఓ కాలు పాదాన్ని గుర్తించి.. వెంటనే పోలీసలకు సమాచారం అందించారు. మంటలను ఆర్పేసి ఆపై వెంటనే నిందితుల ఇంటికి బయలుదేరారు. నిందితులు ఇద్దరూ వస్త్రాలు మార్చుకని బయటకు వెళ్లడానికి సిద్ధం అయ్యారు. కోటేశ్వరరావు ఏమయ్యారని నిలదీయగా.. సమాధానం దాట వేశారు. హత్య చేసి ఇంటికి వచ్చిన తండ్రీకుమారుల వస్త్రాలను సైదులు భార్య కోటమ్మ కాలుస్తూ కనిపించింది. అదే సమయంలో అక్కడకు చేరుకున్న పోలీసులు ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
తర్వాత పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. శనివారం ఉదయం గురజాల ప్రభుత్వాసుపత్రి నుంచి వైద్యులను రప్పించి ఘటనా స్థలంలోనే పంచనామా చేయించారు. ఈ ఘటనపై మధ్యాహ్నం బాధిత కుటుంబీకులు, బంధువులు ధర్నాలు చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సీఐ నచ్చజెప్పి భరోసా ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఘటన జరిగిన తీరును బట్టి చూస్తే పథకం ప్రకారమే కోటేశ్వర రావును హతమార్చారని పోలీసులు భావిస్తున్నారు. ప్రధాన నిందితుడు సైదులుపై గతంలోనూ పలు కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. హత్యకు పాత కక్షలు కారణం అని వారు భావిస్తున్నారు. వివాహేతర సంబంధం కోణంలోనూ పరిశీలిస్తు్ననారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసినట్లు సీఐ షేక్ బిలాలుద్దీన్ చెప్పారు.