Pakistani man love jihad in Hyderabad: అతను పాకిస్తాన్ నుంచి వచ్చాడు. జాతీయత దాచి పెట్టాడు. అక్రమ పత్రాలతో ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఆఫీసులో హిందూ యువతిని ప్రేమ పేరుతో ముగ్గులోకి లాగాడు. ఇస్లాంలోకి మార్చాడు.  కొన్నాళ్లు కాపురం చేసి.. మళ్లీ వేరే అమ్మాయిని ట్రాప్ చేశాడు. భార్యను వదిలేశాడు. ఇప్పుడా హిందూ యువతి పూర్తిగా మోసపోయింది. కానీ ఇంకెవరూ మోసపోకూడదని లవ్ జీహాద్ కు బలి కాకూడదని.. ధైర్యంగా పోలీసుల వద్దకు వచ్చింది. ఆమెకు అండగా.. సినీ నటి కరాటే కల్యాణి ఉన్నారు.  హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని మౌంట్‌ బంజారా కాలనీలో  పాకిస్థాన్‌ మూలాలున్న ఫహద్‌ అనే వ్యక్తి, కీర్తి అనే హిందూ యువతిని మతం మార్పు చేయించి 2016లో వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు మార్చి “దోహా ఫాతిమా”గా పెట్టాడు. ఫహాద్.. హైటెక్ సిటీలో సీపాల్ అనే కంపెనీలో పని చేస్తున్నాడు. ఆఫీసులో పనిచేసే మరో మహిళను ట్రాప్ చేశాడు. ఆమెను కూడా మతం మార్చి పెళ్లి చేసుకున్నాడో లేదో తెలియదు కానీ కాపురం పెట్టేశారు. ఈ విషయం తెలియడంతో దోహాఫాతిమా వారిని .. వెళ్లి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చింది.   పోలీసులు ఫహద్‌, ఆ మహిళను అరెస్ట్‌ చేసి విచారణ చేస్తున్నారు.

పోలీసుల సమాచారం ప్రకారం, ఫహద్‌ 1998లో పాకిస్థాన్‌ నుంచి భారత్‌ వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడ్డాడు. అతను ప్రేమ, వివాహం పేరుతో యువతులను లక్ష్యంగా తీసుకొని మతమార్పిడి చేయించేవాడని ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు ఫహద్‌ గత రికార్డులను పరిశీలిస్తూ, మరే ఇతర బాధితులు ఉన్నారా అని ఆరా తీస్తున్నారు.  ఫహద్‌ ప్రేమ, వివాహం పేరుతో యువతులను మతం మార్పిడి చేయించేవాడన్న ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోంది.

బాధితురాలు కీర్తి..అలియాస్ దోహా ఫాతిమా తనకు న్యాయం చేయాలని సినీ నటి, ఉద్యమకారిణి అయిన కరాటే కల్యాణిని ఆశ్రయించారు. కీర్తి కరాటే కల్యాణి దూరపు బంధువు కావడంతో ఆమె కొంత మందితో కలిసి  బంజారాహిల్స్ లో ఉంటున్న పాకిస్తానీ వ్యక్తి ఫహద్ ఇంటికి వెళ్లారు. అప్పటికే అక్కడ ఆయన సహజీవనం చేస్తున్న మహిళతో సరసాలు సాగిస్తున్నారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ఫహాద్ జాతీయతపై పరిశీలన చేస్తున్నారు.  పాకిస్తాన్ జాతీయుడికి హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగం ఎలా వచ్చిందన్నదానిపై ఆరా తీస్తున్నారు. అదే సమయంలో.. అతను .. ఇక్కడే ఉండి ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు.. హిందూ అమ్మాయిల్ని ఎందుకు ట్రాప్ చేస్తున్నాడన్నదానిపైనా ఆరా తీస్తున్నారు.                    

అతను పని చేస్తున్న కంపెనీలోనూ ఫహాద్ ప్రవర్తనపై ఆరా తీస్తున్నారు. అయితే అతను అనుమానాస్పదంగా ఏమీ ప్రవర్తించలేదని.. ప్రేమించుకుని ఇష్టాపూర్వకంగానే మతం మార్చుకున్నారని.. కానీ విబేధాలు రావడంతో దూరంగా ఉంటున్నారని.. అందుకే వివాదం వచ్చిందని ఫహాద్ స్నేహితులు చెుతున్నారు. ఈ అంశంపై పోలీసులు దర్యాప్తు చేసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.