కరోనా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచీ పరిస్థితి మొత్తం మారిపోయింది. నిత్యం విద్యార్థులతో కళకళలాడాల్సిన విద్యాలయాలు బోసిపోయాయి. పరిస్థితి కాస్త కుదుటపడుతున్న కొద్దీ అన్నీ పట్టాలెక్కినా కూడా ఇంకా మొదలు కానిది ఏమన్నా ఉన్నాయంటే అవి చదువులే. ఏడాదిన్నరగా విద్యార్థులు ప్రత్యక్ష బోధనకు దూరంగా ఆన్ లైన్ క్లాసుల వెంటపడ్డారు. కళ్లు కాయలు కాసేలా కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్ ల ముందు గంటల తరబడి కూర్చుంటున్న పరిస్థితులున్నాయి. ఎప్పుడెప్పుడు ఈ నాలుగు గోడల మధ్యనుంచీ నలుగురి మధ్యకి వెళతామా అని విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే చదువుకునేందుకు బయటకు వెళ్లే ఆడపిల్లలకు రకరకాల వేధింపులు తప్పవు. కానీ ఇంట్లో ఉన్నా అవి కొనసాగడం బాధాకరం. అదికూడా ఆన్ లైన్ క్లాసులోకి చొరబడి మరీ బెదిరిస్తున్నారంటే ఏమనుకోవాలి.
హైదరాబాద్ కి చెందిన ఓ పేరొందిన కళాశాల విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తోంది. ఆన్‌లైన్ క్లాసులు జరుగుతుండగా హఠాత్తుగా ఓ అగంతకుడు సెడన్ గా ఆన్ లైన్లోకి చొరబడ్డాడు. ఓ విద్యార్థిని పేరు ప్రస్తావించి రేప్ చేస్తానని బెదిరించాడు. క్లాసు చెబుతున్న లెక్చరర్ వరస్ట్ అంటూ అసభ్యకర కామెంట్స్ పెట్టాడు. దీంతో అప్పటి వరకూ సబ్జెక్ట్ లో నిమగ్నమైన విద్యార్థులకు ఏం జరుగుతోందో అర్థంకాలేదు. లెక్చరర్ పరిస్థితి కూడా దాదాపు ఇదే. విద్యార్థికి అసభ్యకరమైన మెసేజెస్ చేశాడు. దీంతో ఏం చేయాలో పాలుపోని యాజమాన్యం మరుసటి రోజు పాస్ వర్డ్ మార్చేసింది.
Also Read:తెలంగాణలో 'మెడిసన్ ఫ్రం స్కై'.. డ్రోన్ల ద్వారా కోవిడ్ వ్యాక్సిన్లు.. నేటి నుంచి ట్రయల్స్
పాస్ వర్డ్ మార్చినా అగంతకుడు మాత్రం అస్సలు తగ్గలేదు. మళ్లీ వారి ఆన్‌లైన్ క్లాసుల్లో చొరబడ్డాడు. కాలేజీ టీచర్ జీమెయిల్‌ను హ్యాక్ చేసి పలువురికి అసభ్యకరమైన మెయిల్స్ పంపించాడు. విస్తుపోయిన కాలేజీ యాజమాన్యం తప్పని పరిస్థితిలో రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also read: పసిడి ప్రియులకు ఈ రోజు కూడా శుభవార్త..నిన్నటి కన్నా మరింత తగ్గిన బంగారం ధర
Also Read: తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు... ప్రధాన నగరాల్లో ధరలు ఇలా..
Also read: తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులు వర్షాలు.. ఆ ఐదు జిల్లాల వారికి అలెర్ట్..