Noida Wife Swapping:
నోయిడాలో వైఫ్ స్వాపింగ్ కేసు..
నోయిడాలో ఓ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్నేహితుడితో పడక పంచుకోవాలని ఓ వ్యక్తి తన భార్యను బలవంతం చేశాడు. మాట వినలేదన్న కోపంతో మందు తాగించాడు. ఒప్పుకోకపోతే విడాకులు ఇస్తానని బెదిరించాడు. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని వచ్చిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కి చెందిన మహిళ నోయిడాకి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే...పెళ్లైనప్పటి నుంచి భర్తతో పాటు అత్తమామల వేధింపులు మొదలయ్యాయి. వెస్టర్న్ లైఫ్‌స్టైల్‌కి అలవాటు పడాలని ఆ మహిళను బలవంతం చేశారు. అంతే కాదు. భర్తతో ఎప్పుడు సన్నిహితంగా ఉండాలో అత్త డిసైడ్ చేసేది. వాళ్లు చెప్పినట్టు వినకపోతే మాటలతో తీవ్రంగా వేధించేవారు. ఈ క్రమంలోనే గతేడాది ఏప్రిల్ 18న ఆమె భర్త పార్టీ ఉందని చెప్పి ఓ ఫ్లాట్‌కి తీసుకెళ్లాడు. అక్కడే అతడి ఫ్రెండ్, ఫ్రెండ్ వైఫ్ కూడా ఉన్నారు. అప్పుడే వైఫ్ స్వాపింగ్ గురించి చెప్పాడు. "నువ్వు నా ఫ్రెండ్‌తో గదిలోకి వెళ్లు, నేను నా ఫ్రెండ్ భార్యతో గదిలోకి వెళ్తాను" అని చెప్పాడు. ఈ మాటలు విని ఆ మహిళ షాక్ అయింది. ఇష్టం లేదు అని తేల్చి చెప్పింది. అయినా ఊరుకోకుండా ఆమెకు బలవంతంగా మందు తాగించాడు. మాట వినకపోతే విడాకులిచ్చేస్తానని బెదిరించాడు. అయినా ఆ బాధితురాలు అందుకు ఒప్పుకోలేదు. ఇదంతా జరిగి ఏడాదైన తరవాత...ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ మహిళ. జూన్ 23న పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లెయింట్ ఇచ్చింది. ఈ ఫిర్యాదు ఆధారంగా మొత్తం 9 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు...విచారణ కొనసాగిస్తున్నారు.
గతేడాది రాజస్థాన్‌లో..
గతేడాది రాజస్థాన్‌లోని బికనీర్‌లో భార్యల మార్పిడికి సంబంధించిన షాకింగ్ కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒకరి భార్యను మరొకరికి ఇచ్చిపుచ్చుకునే ఈ ఆటలో పాల్గొనడానికి నిరాకరించిందని, ఓ భర్త తన భార్యపై క్రూరత్వానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ షాకింగ్ ఘటనలో, 'వైఫ్ స్వాపింగ్' గేమ్‌లో పాల్గొనలేదనే కోపంతో బాధితురాలిని తన భర్తను కొట్టినట్లు కేసును విచారణ చేస్తున్న అధికారులు తెలిపారు. రాజస్థాన్‌లోని బికనీర్‌లోని ఓ హోటల్ గదిలో ఈ ఘటన జరగ్గా, భోపాల్‌లో కేసు నమోదైంది. ఫిర్యాదు చేసిన మహిళ భర్త బికనీర్‌లోని 5-స్టార్ హోటల్‌లో మేనేజర్‌గా ఉన్నారు. పోలీసులకు బాధితురాలు చేసిన ఫిర్యాదు మేరకు.. నిందితుడు అమర్ (భర్త) తనను హోటల్ గదిలోకి లాక్కెళ్లి ఫోన్ తీసుకెళ్లాడని తెలిపింది. రెండు రోజులుగా మద్యం సేవిస్తూ, డ్రగ్స్ తీసుకుంటూ ఉన్నాడు. తన భర్త వివిధ అమ్మాయిలతోనే కాకుండా అబ్బాయిలతో కూడా లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్నాడని బాధితురాలు తెలిపింది. అంటే ఆమె భర్త ద్విలింగ సంపర్కుడు. తాను తన భర్త ప్రవర్తనతో బాధపడ్డానని, కానీ భార్య మార్పిడి గేమ్ కు మాత్రం ఒప్పుకోలేదని చెప్పింది.తాను భార్య మార్పిడి గేమ్‌లో పాల్గొనడానికి నిరాకరించినప్పుడు, భర్త తనతో గొడవపడ్డాడని, తనను అసభ్యంగా తిట్టడమే కాక, అసహజ రీతిలో శ్రుంగారంలో పాల్గొన్నాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది.