NIA Searches:
100చోట్ల తనిఖీలు..
ఆరు రాష్ట్రాల్లో NIA సోదాలు కొనసాగుతున్నాయి. హరియాణా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్‌లలో టెర్రక్ నార్కొటిక్స్ కేసులపై విచారణ జరుగుతోంది. కొంతమంది గ్యాంగ్‌స్టర్‌లు అక్రమంగా డ్రగ్స్‌ని సప్లై చేస్తున్నారన్న సమాచారం మేరకు పూర్తి స్థాయిలో సోదాలు మొదలు పెట్టారు అధికారులు. దాదాపు 100 ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. ఆయా రాష్ట్రాల పోలీసులతో పాటు NIA అధికారులూ సోదాలు చేపడుతున్నారు. గతేడాది మూడు కేసులు నమోదు చేసిన NIA..ఇప్పుడు అందుకు సంబంధించిన కూపీ లాగుతోంది. 2022లో మే నెలలో పంజాబ్ ఇంటిలిజెన్స్ హెడ్‌క్వార్టర్స్‌పై దాడి జరిగింది. ఇందులో కీలక నిందితుడు దీపక్ రంగాను
ఈ ఏడాది జనవరి 25న అరెస్ట్ చేశారు. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్ర మూకలతో సంబంధాలున్నట్టు గుర్తించారు. ఈ ఒక్కటే కాదు. ఇంకొన్ని నేరాల్లోనూ దీపక్ రంగా A1గా ఉన్నాడు. ఈ దాడులు చేసేందుకు ఉగ్రవాదులతో లావాదేవీలు చేసినట్టు NIA గుర్తించింది. ఈ మేరకు గతేడాది సెప్టెంబర్‌లో సుమోటోగా ఈ కేసు విచారణ మొదలు పెట్టింది. విదేశాల నుంచి కొందరు ఉగ్రవాదులు ఇక్కడ దాడులు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు పసిగట్టింది. ముఖ్యంగా నార్త్ ఇండియాని టార్గెట్ చేసుకుని ఈ దాడులకు పాల్పడుతున్నట్టు గుర్తించింది. వీటితో పాటు ఆయుధాలనూ అక్రమంగా తరలించేందుకు పెద్ద టెర్రర్ గ్యాంగ్‌స్టర్ డ్రగ్ నెట్‌వర్క్ ఉందని తేల్చి చెప్పారు. ఆయుధాలతో పాటు పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలూ వాళ్ల దగ్గరున్నాయి. సరిహద్దు ప్రాంతం నుంచి అక్రమంగా వాటిని ఇండియాలోకి తీసుకొస్తున్నారు.