NIA Officers Found Rameswaram Cafe Bomb Blast Accused: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన రామేశ్వరం కేఫ్‌ (Rameswaram Cafe) ‌లో పేలుడు ఘటనకు సంబంధించి నిందితున్ని ఎన్ఐఏ (NIA) అధికారులు గుర్తించారు. నిందితుడు బీఎంటీసీ బస్సులో మాస్క్ లేకుండా కెమెరాకు చిక్కాడు. ఈ ఫోటోను అధికారులు విడుదల చేశారు. ముమ్మర దర్యాప్తులో భాగంగా వారికి కీలక ఆధారాలు లభించాయి. అయితే, బాంబు దాడికి సంబంధించి నిందితుని సమాచారం అందించిన రికి ఎన్ఐఏ బుధవారం రూ.10 లక్షల రివార్డు ప్రకటించింది.


కర్ణాటక రాజధాని బెంగుళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్ లో మార్చి 1న (శుక్రవారం) బాంబు పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. ముందు ఇది సిలిండర్ పేలుడు అని భావించినా ఆ తర్వాత కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేఫ్‌లో ఓ అనుమానాస్పద బ్యాగ్ కనిపించింది. అందులోనే పేలుడు పదార్థాలు పెట్టినట్టు అనుమానించారు. ఆ తరవాత ఫోరెన్సిక్ టీమ్ కూడా రంగంలోకి దిగింది. IED పేలుడు సంభవించినట్టు స్వయంగా ముఖ్యమంత్రి సిద్దరామయ్య వెల్లడించారు. CC కెమెరా ఫుటేజ్‌లో ఓ వ్యక్తి బ్యాగ్‌తో కేఫ్‌లోకి వచ్చినట్టు రికార్డ్ అయింది. అతనిపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం...ఈ వ్యక్తే కేఫ్‌లోకి వెళ్లి అక్కడ బ్యాగ్ పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తరవాత కాసేపటికే పేలుడు సంభవించింది. సీసీ ఫుటేజ్‌లో అనుమానితుడు మాస్క్, కళ్లజోడు పెట్టుకుని ఉన్నాడు. ఈ అనుమానితుడితో పాటు ఉన్న వ్యక్తిని బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 


ఎన్ఐఏ చేతికి..


కాగా, లోక్ సభ ఎన్నికలు, పలు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఈ పేలుడు జరగడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ కేసును ఎన్ఐఏ చేతికి అప్పగించింది. దీంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన ఎన్ఐఏ పలు కీలక ఆధారాలు సేకరించింది. బెంగళూరు బాంబు పేలుడు కేసులో ప్రధాన నిందితుడికి సంబంధించిన ఆచూకీ గానీ వివరాలు గానీ తెలియజేసిన వారికి రూ.10 లక్షల నజరానా ఇస్తామని NIA ప్రకటించింది. ఈ సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చింది. ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతోంది. కేఫ్‌లోని సీసీ కెమెరాలో నిందితుడి విజువల్స్ రికార్డ్ అయ్యాయి. మాస్క్‌, టోపీ, గ్లాసెస్ పెట్టుకుని పూర్తిగా ఫేస్‌ని కవర్ చేసుకున్నాడు. కేఫ్‌కి వచ్చిన నిందితుడు ఇడ్లీ ఆర్డర్ ఇచ్చాడు. ఆ తరవాత తన వెంట తెచ్చుకున్న బ్యాగ్‌ని అక్కడే చెట్టు దగ్గర వదిలేసి వెళ్లిపోయాడు. ఆ తరవాత కాసేపటికే బాంబు పేలింది. కేఫ్‌లోనే దాదాపు 9 నిముషాల పాటు నిందితుడు ఉన్నట్టు సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలను బట్టి తెలుస్తోంది. నలుగురు అనుమానితులకు పేలుడు ఘటనతో నేరుగా సంబంధం లేకపోయినా నిందితుడికి సహకరించినట్టు సమాచారం. తాజాగా, నిందితుడు మాస్క్ తీసేసి ఉన్న ఫోటోలను అధికారులు విడుదల చేశారు.


Also Read: Karnataka CM: కర్ణాటక సీఎంకు బాంబ్ బ్లాస్ట్ బెదిరింపులతో మెయిల్స్! క్లారిటీ ఇచ్చిన సిద్ధరామయ్య,