ఉపాధ్యాయిని కావాలన్న ఆకాంక్షతో బీఎస్సీ బీఈడీ చేసింది.. శిక్షణ తీసుకుని ఉపాధ్యాయురాలిగా స్థిరపడాలని కలలు కంది.. ఈలోపు పెళ్లీడు వచ్చిందని తల్లితండ్రులు సంబంధాలు చూడటం మెుదలు పెట్టారు. మంచి ఉద్యోగం ఉన్న పెళ్లి కొడుకు కోసం ప్రయత్నించారు. సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేస్తున్న యువకుడు ఉన్నాడని తెలిసి వెంటనే వాళ్ల పెద్దలతో మాట్లాడి  సంబంధాలు మాట్లాడుకుని.. పెళ్లి చేసేశారు. కానీ.. ఆ పెళ్లే ఆమె పాలిట శాపంగా మారింది. అసలు వివరాల్లోకి వెళ్తే..


తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం పటవల గ్రామానికి చెందిన బడుగు గంగా భవానీకి.., కేంద్రపాలిత ప్రాంతమైన యానాం పరంపేటకు చెందిన సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ జంగా కృష్ణమూర్తికి అక్టోబరు 21న వివాహం జరిగింది. పెళ్లైన నెలరోజులు బాగానే గడిపాడు. ఢిల్లీలో ఉద్యోగం కావడంతో భార్యను ఇంటి దగ్గరే వదిలి వెళ్లిపోయాడు. ఇక అప్పటి నుంచి మొదలైంది. అతగాడిలోని వికృతరూపం.. వెళ్లీ వెళ్లగానే మొదలు పెట్టాడు.. ఏం చేస్తున్నావు.. తిన్నావా.. ఒక్కదానివే పడుకున్నావా.. ఇలా ప్రశ్నలతో మొదలైన టార్చర్‌ అనుమానపు పిశాచిలా చిత్రవిచిత్రాలుగా వేధింపసాగాడు. తరచూ ఫోన్లు చేస్తూ సూటిపోటి మాటలు అంటూ రకరకాల నిందలు వేస్తూ వేధించేవాడు. చాలాసార్లు భరించిన ఆ యువతి ఒకసారి తల్లితండ్రుల దృష్టికి తీసుకువచ్చింది. అల్లుడు గారు సంక్రాంతికి వస్తారు కదమ్మా... అప్పుడు మాట్లాడదాంలే అని కూతురుకి సర్దిచెప్పారు తల్లిదండ్రులు.


ఇటీవలే ఇంటికి వచ్చిన గంగాభవాని.. మంగళవారం రాత్రి ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని బలవన్మరనానికి పాల్పడింది. విగతజీవిగా మారిన కుమార్తెను చూసి తల్లితండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.  సెల్‌ఫోన్‌లో తరచూ అనుమానపు మాటలతో వేధించేవాడని, ఇది భరించలేక తీవ్ర మనస్థాపానికి గురైన తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిరదని మృతురాలి తల్లి లక్ష్మీకాంతం గుండెలవిసేలా రోదిస్తూ తెలిపింది.  తమ కుమార్తెన మానసికంగా హింసించేవాడని, ఇది భరించలేకపోయిందని వాపోయింది. గంగాభవాని తల్లితండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Also Read: Kidnap Case: యువతి కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. స్నాప్‌ చాట్‌ లో పరిచమైన వ్యక్తితో లాంగ్ డ్రైవ్.. ఆ తర్వాత


Also Read: Shilpa Chowdary: శిల్పా చౌదరికి బెయిల్ మంజూరు... పక్కా స్కెచ్ తో రూ.కోట్లు కొట్టేసిందా?... శిల్ప కాల్ డేటా విశ్లేషిస్తోన్న పోలీసులు


Also Read: Warangal Crime: బెయిల్ పూచీకత్తు కోసం ఫోర్జరీ సంతకాలు... కోర్టులను మోసం చేస్తున్న ముఠా అరెస్టు 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి