విశాఖపట్నానికి చెందిన ఓ గజదొంగను నెల్లూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. 2007 నుంచి నిందితుడు దొంగతనాలు చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. నెల్లూరు జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం12 నేరాలు చేశాడని తెలిపారు పోలీసులు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తున్న బోలా నాగసాయిని కావలి పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. అతని వద్ద 212 గ్రాముల బంగారు ఆభరణాలు 315 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ మొత్తం 10,30,000 రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. ఈ మేరకు కావలి డీఎస్పీ డి.ప్రసాద్ మీడియాకు వివరాలు తెలియజేశారు. నగదుకంటే ఎక్కువగా బంగారు, వెండి వస్తువుల్నే టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడేవాడని, ఓ స్క్రూ డ్రైవర్, మరో రెండు ఇనుప పనిముట్లతో తాళాలు బద్దలుగొట్టి చోరీలకు పాల్పడేవాడని డీఎస్పీ తెలిపారు.
Also Read: యువతి కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. స్నాప్ చాట్ లో పరిచమైన వ్యక్తితో లాంగ్ డ్రైవ్.. ఆ తర్వాత
పాత నేరస్థుడే చోరీలు
విశాఖ జిల్లా గాజువాకకు చెందిన పాత నేరస్థుడు నాగసాయి ఇప్పటి వరకూ సుమారు 100 నేరాలు చేసినట్లు కావలి డీఎస్పీ డి.ప్రసాద్ తెలిపారు. '2007 దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడు పలుమార్లు అరెస్టై జైలుకు వెళ్లి వచ్చాడు. ఇటీవల చిత్తూరు జిల్లా పోలీసులు ఓ కేసుపై నాగసాయిని అరెస్టు చేశారు. ఆ తర్వాత ఈ ఏడాది జులైలో జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. నెల్లూరు జిల్లాలో ఇప్పటి వరకూ 12 నేరాలకు పాల్పడ్డాడు. కావలి రూరల్ 2, బాలాజీ నగర్ 4, నెల్లూరు టైన్ 2, కావలి వన్ టైన్ 2, మరో 2 చిన్న నేరాలు చేశారు. ఈ దొంగతనాల్లో మొత్తం కలిసి గోల్డ్ 212 గ్రాములు, 315 గ్రాముల వెండి చోరీ చేశాడు. వీటి విలువ సుమారు పది లక్షల రూపాయలు ఉంటుంది. నిందితుడు గత 14 సంవత్సరాలుగా నేరాలకు పాల్పడుతున్నాడు. పోలీసులు ఎన్నిసార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా మారడంలేదు. నిందితుడిని రిమాండ్ పంపించాం.' అని కావలి డీఎస్పీ డి.ప్రసాద్ అన్నారు.
Also Read: కట్టుకున్న భార్యపై భర్త ఘాతుకం.. వివస్త్రను చేసి, గొంతుకు తాడు బిగించి హత్య
Also Read: Warangal Crime: బెయిల్ పూచీకత్తు కోసం ఫోర్జరీ సంతకాలు... కోర్టులను మోసం చేస్తున్న ముఠా అరెస్టు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి