నెల్లూరు నగరం నడిబొడ్డున పట్టపగలు మర్డర్ అటెంప్ట్ జరిగింది. నిత్యం రద్దీగా ఉంటే ప్రాంతంలో హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనపై నగరంలో కలకలం రేగుతోంది. ఏం జరుగుతుందో తెలిసేలోపు దుండగులు పరారయ్యారు. ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా మారింది. సినిమాల్లో చూసిన సీన్ లాగే ఈ వ్యవహారం జరిగింది. 

Continues below advertisement


అసలేం జరిగింది
 
నెల్లూరు నగరం పెద్ద బజార్ చాపల మార్కెట్ సమీపంలో ఈ హత్యాయత్నం జరిగింది. మార్కెట్లో శివ అనే వ్యక్తిపై గుర్తుతెలియని దుండగుల హత్యాయత్నం చేశారు. కత్తులతో వెంటాడి పొడిచారు. వారి బారి నుంచి తప్పించుకునే క్రమంలో శివ మార్కెట్లోకి పరుగులు పెట్టాడు. బాధితుడు శివ కేకలు వేస్తూ పరుగులు పెట్టాడు. దీంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. అందరూ గుమికూడతారనుకున్న అనుమానంతో దుండగులు అక్కడ్నుంచి పరారయ్యారు. దుండగుల దాడిలో గాయపడ్డ శివను నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్య చికిత్స కోసం ఓ ప్రైవేటు కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శివ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. 


Also Read:  తెలుగు అకాడమీలో మరో రూ.20 కోట్ల స్కామ్‌కు స్కెచ్.. ఇవాళ కీలక వ్యక్తులు అరెస్టయ్యే ఛాన్స్!


పాత కక్షలపై పోలీసుల ఆరా


శివ అని వ్యక్తిపై దాడి జరిగిన సంఘటన సమాచారాన్ని తెలుసుకున్న ఒకటో పట్టణ పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. పాత కక్షల నేపథ్యంలో దాడి జరిగిందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. పారిపోయిన వారి కోసం స్పెషల్ టీమ్ లు రంగంలోకి దిగాయి. సీసీ టీవీ ఫుటేజీని కీలకంగా భావిస్తున్నారు. వీలైనంత త్వరలో దుండగుల్ని అదుపులోకి తీసుకుంటామన్నారు పోలీసులు. అదే సమయంలో బాధితుడు శివ నుంచి మరింత సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం శివ ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. 


Also Read: Mumbai Rave Party: ముంబయి క్రూజ్ షిప్ లో మరోసారి తనిఖీలు... మఫెడ్రోస్ డ్రగ్స్ స్వాధీనం.. ఎన్సీబీ అదుపులో మరో 8 మంది


Also Read: ‘ఆడు మగాడ్రా బుజ్జి.. అమ్మాయి కాదురా..!’ ట్వీట్ చేసిన పోలీసులు.. టెంప్ట్ అయ్యారో ఇక అంతే.


Also Read: బాలీవుడ్ బాద్ షా కి అండగా అభిమానులు, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్న #WeStandWithSRK


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి